Hydra: 2024 ఏడాది ఆఖరు రోజున కూడా హైడ్రా.. పలువురు బాధితుల గోస కట్టుకున్నది. ఖాజాగూడ చెరువు బఫర్ జోన్‌లో ఉన్నాయంటూ సుమారు 20కిపైగా దుకాణాలను హైడ్రా సిబ్బంది తొలగించారు. దీంతో ఆయా దుకాణాల వ్యాపారులు, వారి కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కొత్త సంవత్సరం వస్తుందన్న ఆశ.. వారిలో ఆవిరి అయింది.
Hydra: ఎన్నో ఏండ్లుగా ఇక్కడే నివాసముంటున్నామని, ఇప్పుడే ఎలా కూల్చివేస్తారంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హడావుడిగా కూల్చివేయాల్సిన అవసరమేముందని ప్రశ్నిస్తున్నారు. నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోనే కూల్చివేయడం దుర్మార్గం అంటూ శాపనార్ధాలు పెడుతున్నారు. దుకాణాల్లో ఉన్న ఫ్రిజ్, టీవీలు, ఇంకా విలువైన ఎన్నో సామగ్రితో సహా కూల్చివేయగా, అవి ధ్వంసం అయ్యాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
Hydra: భారీ పోలీసు బందోబస్తు మధ్యన ఉదయం వచ్చిన అధికారులు, సిబ్బంది సామాన్లతో సహా కూల్చివేతలు మొదలుపెట్టారు. కొంత గడువు ఇవ్వాలని బాధితులు వేడుకున్నా పట్టించుకోలేదని స్థానికులు తెలిపారు. తమకు జీవనాధారమైన దుకాణాలను కూల్చివేసి తమను రోడ్డున పడేశారని బాధిత కుటుంబాలు తమ గోడు వెళ్లబోసుకున్నాయి.