Hyderabad: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రాజ్‌భవన్ పేరును అధికారికంగా లోక్‌భవన్‌గా మార్చుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు రాజ్‌భవన్, రాజ్‌నివాస్ వంటి పేర్లను లోక్‌భవన్, లోక్‌నివాస్‌లుగా మార్చుకోవాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇటీవల సూచించింది. వలస పాలన జ్ఞాపకాలను తొలగించే చర్యల్లో భాగంగా ఈ మార్పును పరిశీలించాలని గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు కేంద్రం లేఖ పంపింది.
ఇప్పటికే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, అసోం, కేరళ, త్రిపుర, ఒడిశా వంటి రాష్ట్రాలు ఈ మార్పులను అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణ కూడా ఇప్పుడు ఈ పేరుమార్పును అమలు చేసింది.

