Hyderabad News: మందుబాబులకు ఇదో బంపర్ ఆఫర్.. కొత్త సంవత్సరం సందర్భంగా, పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ పండుగ చేసుకునే వారికి భలే ఛాన్స్‌లా ఉన్నది. పోలీసుల డ్రంకన్ డ్రైవ్ చెకింగ్‌లు తప్పించుకునేందుకు ఇదో మంచి అవకాశం. ఇది యమ కిక్కిచ్చే సదుపాయం. అసలు విషయం ఏంటంటే? అర్ధరాత్రి పూట మీకు మందు ఎక్కువై ఇంటికెలా వెళ్లాలి, పోలీసులను ఎలా తప్పించుకోవాలి? అనుకుంటే వెంటనే ఈ నంబర్‌కు కాల్ చేస్తే ఉచితంగా వారు ఫ్రీ క్యాబ్ సదుపాయం కల్పిస్తున్నారు. మిమ్మల్ని ఇంటి వద్ద దింపేసి వస్తామని చెప్తున్నారు.
Hyderabad News: కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ప్రాంతాల పరిధిలో డిసెంబర్ 31న రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ప్రయాణికులకు, నగరవాసులకు డ్రంకన్ డ్రైవ్ ప్రమాదాలను నివారించేందుకు తమ వంతు బాధ్యతగా ఈ సేవలు అందిస్తున్నామని అసోసియేషన్ ప్రకటించింది.
Hyderabad News: ఈ మేరకు తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ ఫోన్‌నంబర్‌ను ప్రకటించింది. 9177624678 నంబర్‌కు కాల్ చేస్తే ఫ్రీక్యాబ్ సర్వీసు అందజేస్తామని తెలిపింది. నగర పరిధిలో 500 కార్లు, 250 బైక్ ట్యాక్సీలు అందుబాటులో ఉంచామని అసోసియేషన్ వెల్లడించింది. ఇక డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడితే జరిమానా, జైలు అన్న చింతను వీడి ఈ నంబర్‌కు కాల్ చేస్తే హాయిగా ఇంటికి చేరుకోవచ్చన్నమాట.