Hyderabad: హైదరాబాద్ నగర పరిధిలోని చంద్రాయన్‌గుట్ట ప్రాంతంలో అధికారులు ఆదివారం (నవంబర్ 2) కూడా అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు. అక్కడి ఓ స్కూల్ భవనాన్ని కూల్చివేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే స్కూల్లో పరీక్షలు జరుగుతుండగా, విద్యార్థులు, ఉపాధ్యాయులు లోపల ఉండగానే, బుల్డోజర్లతో పాఠశాల భవనాన్ని కూల్చివేశారు.
Hyderabad: చంద్రాయన్‌గుట్ట పరిధిలోని హఫీజ్‌బాబానగర్ ప్రాంతంలో ఉన్న అర్నా గ్రామర్ స్కూల్ భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. పాఠశాలలో పిల్లలున్నారు, పరీక్షలు జరుగుతున్నాయి, స్కూల్ సమయం అయిపోయాక కూల్చాలని కోరినా వినలేదని ఆ పాఠశాల టీచర్లు తెలిపారు. భవనం కూల్చవద్దని కోర్టు తీర్పు ఉన్నా, దానిని పరిగణనలోకి తీసుకోలేదని పాఠశాల యాజమాన్యం తెలిపింది.
Hyderabad: తమకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా పాఠశాల భవనంలోకి బుల్డోజర్లతో వచ్చి కూల్చివేతలు చేపట్టడం దారుణమని పాఠశాల టీచర్లు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోర్టుకు సెలవు ఉన్న రోజు వచ్చి ఫర్నిచర్ అంతా ధ్వసం చేశారని పాఠశాల యాజమాన్యం ఆవేదన వ్యక్తంచేసింది. స్కూల్లో విద్యార్థులు ఉండగానే కూల్చివేతలు చేపట్టడంపై స్థానికులు కూడా విస్మయం వ్యక్తంచేస్తున్నారు.

