Hyderabad: పెళ్లై, ఒక కుమారుడు కూడా ఉన్నా.. మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తకు భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని దేహశుద్ధి చేసిన ఘటన నగరంలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని గంధంగూడలో సంచలనం సృష్టించింది. భార్య సడెన్‌గా రావడంతో సీన్ మారిపోయింది.
వివరాల్లోకి వెళ్తే..
వేణు కుమార్, శిరీషలకు 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఏడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. వేణు కుమార్ ఒక ఎలక్ట్రానిక్స్ సంస్థలో తెలంగాణ హెడ్‌గా పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. భార్య శిరీషతో తరచూ గొడవ పడటం మొదలుపెట్టాడు. దీంతో వేణు కుమార్ ప్రవర్తనపై శిరీషకు అనుమానం కలిగింది. ఆమె తన భర్త కదలికలపై నిఘా పెట్టింది.
Also Read: Bandi Sanjay: బీజేపీలో వ్యక్తిగత నిర్ణయాలకు చోటు లేదు.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
ఈ క్రమంలోనే వేణు కుమార్, బెక్కం మౌనిక అనే యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, ఆమెతో కలిసి ఒక గదిలో ఉంటున్నాడని శిరీష తెలుసుకుంది. శనివారం శిరీష తన కుటుంబ సభ్యులతో కలిసి వేణు కుమార్ ఉంటున్న ఫ్లాట్‌కు వెళ్లింది. అక్కడ వేణు కుమార్, మౌనిక ఇద్దరూ ఇంట్లో ఉండటాన్ని చూసి శిరీషకు తీవ్ర ఆగ్రహం వచ్చింది.
వెంటనే శిరీష, ఆమె కుటుంబ సభ్యులు కలిసి వేణు కుమార్, మౌనికలను గట్టిగా దేహశుద్ధి చేశారు. అనంతరం ఇద్దరినీ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం వేణు కుమార్, మౌనికలు నార్సింగి పోలీసుల అదుపులో ఉన్నారు. తన భర్త తనకు కావాలని, మౌనిక దగ్గరకు వెళ్లకుండా చూడాలని శిరీష పోలీసులను కోరినట్లు సమాచారం. ఈ ఘటన నార్సింగిలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

