Humanity Dies

Humanity Dies: మా పరిధి కాదు.. మాదీ కాదు.. పోలీసుల ఓవర్ యాక్షన్.. పట్టని ప్రజల ఎమోషన్

Humanity Dies: ఒక్కోసారి పోలీసులు విచిత్రంగా ప్రవర్తిస్తారు. అత్యవసర సమయంలో వారికీ రూల్స్ గట్టిగా గుర్తొస్తాయి. రూల్ దాటి పని చేయమని తెగేసి చెబుతారు. అవతల ప్రజల ఎమోషన్స్ ని పట్టించుకోరు. చాలా సంఘటనలు నిత్యం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇదిగో తాజాగా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి మృతదేహం హ్యాండోవర్ చేసుకోవడానికి ఆ ప్రాంతం తమ పరిధిలోకి రాదంటూ రెండు రాష్ట్రాల పోలీసులు చేసిన ఓవర్ యాక్షన్ ప్రజల్లో అసహనాన్ని రేకెత్తించింది. 

సరిహద్దు పరిధి విషయమై  ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ పోలీసుల మధ్య జరిగిన వివాదం కారణంగా ప్రమాదంలో మరణించిన యువకుడి మృతదేహం నాలుగు గంటలపాటు రోడ్డుపైనే పడి ఉంది. ఢిల్లీకి ఆనుకుని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాలకు చెందిన వారు పని కోసం ఢిల్లీకి రావడం మామూలే.
ఆ విధంగా, ఎంపీ రాహుల్ అహిర్వార్ (27) కూలీ ఉద్యోగం కోసం నిన్న సాయంత్రం ఢిల్లీకి బయలుదేరాడు. ఇతను ఇటీవలే పెళ్లి చేసుకున్నాడు. 

ఇంటి నుంచి బయటకు వెళ్లి రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఇరుగుపొరుగు వారు ఎంపీ హర్బల్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద స్థలం యూపీలోని మహోబ్‌కాంత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతం అని చెప్పి వెళ్లిపోయారు.

ఇది కూడా చదవండి: Gold Rate Today: వరుసగా రెండోరోజు బంగారం ధరల్లో మార్పు లేదు.. ఈరోజు ధరలివే!

Humanity Dies: గ్రామస్థులు యూపీ పోలీసులకు సమాచారం అందించారు. ఇది ఎంపీ పోలీస్‌ పరిధిలోని ప్రాంతమని చెప్పి జారుకున్నారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. అక్కడ భారీగా  ట్రాఫిక్ జామ్ అయింది. 

విషయం తీవ్రరూపం దాల్చడంతో ఎంపీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రాహుల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు.

పోలీసులు వచ్చే వరకు రాహుల్ మృతదేహం నాలుగు గంటలపాటు రోడ్డు పక్కనే పడి ఉంది. మృతదేహం దగ్గర కుటుంబసభ్యులు రోదిస్తున్న దృశ్యం చూపరులను కలిచివేసింది.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *