Heroines: సినిమా గ్లోబలైజేషన్ అయిన తర్వాత స్టార్స్ పారితోషికాలు చుక్కలు అంటుతున్నాయి. ‘పుష్ప2’తో ఇండియాలో అత్యధిక పారితోషికం అందుకున్న హీరోల జాబితాలో బన్నీ నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే హీరోయిన్స్ కి మాత్రం అంత లేదని తేలిపోయింది. భారతదేశంలో హీరోయిన్స్ లో పదికోట్లకు మించిన రేంజ్ లో కొద్ది మంది మాత్రమే ఉన్నారు. మరి టాప్ టెన్ లో ఉన్న హీరోయిన్స్ ఎవరో చూద్దాం.
ఇది కూడా చదవండి: Manmohan Singh: యమునా నదిలో మన్మోహన్ చితాభస్మం
Heroines: సమంత, పూజా హేగ్డే, కృతి సనన్ 4 కోట్లతో పదవ స్థానంలో ఉండగా నయతార, కియారా అద్వానీ, ఐశ్వర్యారాయ్ 5 కోట్లతో తొమ్మిదో ప్లేస్ లోనూ, దిశాపటాని 6 కోట్లతో ఎనిమిదవ స్థానంలో, శ్రద్ధాకపూర్ 7 కోట్లతో ఏడో ప్లేస్ లో, కంగనారనౌత్ పది కోట్లతో ఆరో స్థానంలో, కరీనా కపూర్ 12 కోట్లతో ఐదో ప్లేస్ లో , కత్రినా కైఫ్ 12 కోట్లతో నాలుగో స్థానంలో, ఆలియాభట్ 15 కోట్లతో మూడో ప్లేస్ లో, దీపికా పదుకొనే 17 కోట్లతో రెండో ప్లేస్ లో ఉండగా, తెలుగు సినిమాతో పరిచయమై అంతర్జాతీయ చిత్రాలలో సందడి చేస్తున్న ప్రియాంక చోప్రా 20 కోట్లతో తొలి స్థానంలో ఉన్నారు. మరి 2025లో ఈ జాబితాలో ఏ యే హీరోయిన్లు చోటు సంపాదిస్తారో చూడాలి.