Harish Rao:తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. గడ్డం ప్రసాద్‌కుమార్ శాసన సభ స్పీకర్‌గా ఎన్నికైన నాటి నుంచి ఆయన చేపడుతున్న చర్యలపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఆ బహిరంగ లేఖలో హరీశ్‌రావు ఘాటు విమర్శలను గుప్పించారు.
Harish Rao:స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ శాసనసభ నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ అసెంబ్లీ ప్రతిష్ఠను దిగజారుస్తున్నారని హరీశ్‌రావు తన లేఖలో పేర్కొన్నారు. స్పీకర్‌గా ఎన్నికై రెండేళ్లు గడిచినా హౌస్ కమిటీల ఊసే లేదని ఆరోపించారు. డిప్యూటీ స్పీకర్ నియామకాన్ని గాలికొదిలేశారని పేర్కొన్నారు. అదే విధంగా ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పును బేఖాతరు చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. తన అభ్యంతరాలపై స్పీకర్ రాతపూర్వక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

