Harish Rao: బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే అయిన తన్నీరు హరీశ్‌రావు త్వరలో పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ మేరకు ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ప్రభుత్వ హామీల అమలు విషయంలో తొలి నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్న హరీశ్‌రావు ఏకంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టడం చర్చనీయాంశంగా మారింది.
Harish Rao: గతంలో ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో జరిగిన ఓ సమావేశంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ఇదే విషయాన్ని చెప్పడం గమనార్హం. ప్రాజెక్టుల నుంచి సాగునీటి ఇక్కట్లపై త్వరలో హరీశ్‌రావు పాదయాత్ర చేయనున్నట్టు ఈ సందర్భంగా కేసీఆర్ ప్రకటించారు. ఆ మేరకు ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది.
Harish Rao: సంగారెడ్డి జిల్లా పరిధిలోని సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ హరీశ్‌రావు ఈ పాదయాత్ర చేస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. తొలుత సంగమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పాదయాత్రను ప్రారంభిస్తారని తెలిసింది.
Harish Rao: సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల నిర్దేశిత ఆయకట్టు ప్రాంతాల్లో వారం రోజులు, 130 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర చేపడుతారు. పాదయాత్ర కొనసాగే గ్రామాల్లో రోజుకో సభ నిర్వహిస్తారని తెలిపింది. ఊరూరా ప్రజల్లో చైతన్యం తెస్తూ ప్రాజెక్టుల ఆవశ్యకత, సాగునీటి లభ్యతపై ప్రజలకు వివరిస్తారు. చివరిరోజున జరిగే భారీ బహిరంగసభకు కేసీఆర్ హాజరుకానున్నారు.

