Uttar Pradesh: తమ పంటలకు నష్టం కలిగించే విచ్చలవిడి పశువులు, ఇతర జంతువుల సమస్యతో ఇబ్బంది పడుతున్న హర్దోయిలోని రైతులు ఇప్పుడు తమ పంటలను రక్షించుకోవడానికి కొత్త పరిష్కారాలను వెతుక్కుంటున్నారు. శాండిలా డెవలప్‌మెంట్ బ్లాక్‌కు చెందిన గ్రామ పంచాయతీ బాగుమావుకు చెందిన చెవిటి, మూగ రైతు రామ్‌నరేష్ సింగ్ ఒక ప్రత్యేకమైన పద్ధతిని అవలంబించాడు. పొలాల్లో ఉన్న ఆవాలు, గోధుమలు, బంగాళదుంపలు అలాగే ఇతర పంటలను రక్షించడానికి అతను ఇప్పుడు ఎలుగుబంటి వేషంలో పొలాల్లో తిరుగుతున్నాడు.
రాంనరేష్ సింగ్ చెవిటి, మూగ. వ్యక్తి. పొలాల్లోని జంతువుల నుంచి పంటలను కాపాడేందుకు ఎలుగుబంటి అవతారం ఎత్తాడు. ఒక పక్క చలి చంపేస్తున్నా.. కోతులు, ఇతర విచ్చలవిడి జంతువులను పొలాల నుండి దూరంగా ఉంచడానికి అతను ఈ పద్ధతిని అనుసరిస్తాడు. ఇప్పుడు రామ్‌నరేష్ వీడియో బయటకు వచ్చింది. అతని కష్టాన్ని, ధైర్యాన్ని ప్రజలు మెచ్చుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: Mohan Babu: మోహన్ బాబు ఇలాకాలో మరో వివాదం.. వీడియోతో సహా దొరికిన సిబ్బంది
Uttar Pradesh: విచ్చలవిడి పశువులు, ఇతర జంతువుల నుంచి పంటలను కాపాడేందుకు స్థానిక ప్రభుత్వ అధికారులు ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోవడంతో రైతులే ఈ సమస్యకు పరిష్కారం వెతుకుతున్నారు. ఈ పరిస్థితి రైతు సంఘం ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలను ఎత్తిచూపుతుంది. ఇక్కడ చలి, ఇతర కష్టాలు ఉన్నప్పటికీ, వారు తాము కష్టపడి పండించుకున్న పంటలను కాపాడుకోవడానికి కొత్త పద్ధతులను అనుసరించవలసి వస్తోంది.