Ghatikachalam

Ghatikachalam: ఓటిటిలో వణికిస్తున్న ‘ఘటికాచలం’!

Ghatikachalam: మెడిసన్ చదువుతున్న ఓ యువకుడు రాత్రిపూట వింత గొంతు విని భయపడతాడు. ఆ గొంతు వెనుక దాగిన రహస్యం ఏంటి? అతని విచిత్ర ప్రవర్తనకు కారణం ఏమిటి? ఈ ప్రశ్నలతో ఆకట్టుకుంటుంది నిఖిల్ దేవాదుల హీరోగా నటించిన ‘ఘటికాచలం’. అమర్ కామెపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌లో ప్రభాకర్, ఆర్వికా గుప్తా ముఖ్య పాత్రల్లో నటించారు.

Also Read: 8 Vasanthalu: ఎనిమిది వసంతాలు’ – ప్రేమకు కొత్త నిర్వచనం, కానీ కథలో లోటు!

Ghatikachalam: నిజ జీవిత సంఘటనల నుంచి స్ఫూర్తి పొందిన ఈ చిత్రం, హారర్, సస్పెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. మే 31న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, కేవలం 20 రోజుల్లోనే అమెజాన్ ప్రైమ్, ఆహాలో స్ట్రీమింగ్‌కు రావడం విశేషం. చిన్న సినిమాగా థియేటర్లలో పెద్దగా ఆడనప్పటికీ, ఓటీటీలో ఈ మూవీ ఆసక్తి రేపుతోంది. హారర్ సినిమాలపై మక్కువ ఉన్నవారికి ‘ఘటికాచలం’ ఒక థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్! ఇందులోని ట్విస్టులు, సస్పెన్స్ ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *