Gas Cylinder: ఇక నుంచి గ్యాస్ సిలిండర్ పొందే విధానం మారుతుంది. ప్రతి కస్టమర్ తప్పనిసరిగా ఈ ప్రక్రియను పాటించాలి. లేదంటే సిలిండర్ రీఫిల్లింగ్‌కు సమస్యలు తప్పవు. గ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్ కోసం ఇప్పుడు ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ, ఓటీపీ సిస్టమ్‌ను కఠినంగా అమలు చేశారు. ఇప్పటికే ఆ విధానం ఉన్నా.. ఎంతో మంది ఇప్పటికీ ఈ-కేవైసీ చేసుకోకపోవడంతో అది సరిగా అమలు కావడం లేదు.
Gas Cylinder: సిలిండర్ పొందే సమయంలో వినియోగదారుడు డెలివరీ బాయ్‌కు ఓటీపీ (వన్ టైమ్ పాస్వర్డ్) ఇవ్వడం తప్పనిసరి చేశారు. కస్టమర్ ఓటీపీ ఇవ్వకపోతే సిలిండర్ ఇవ్వొద్దని కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఫుడ్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన సమాచారం మేరకు ఈ-కేవైసీ చేసుకోవాల్సిందిగా గత ఏడాదిన్నరగా గ్యాస్ వినియోగదారులను కోరుతున్నా ఆశించిన ఫలితం రావడం లేదని పేర్కొన్నది. ఇప్పటి వరకూ కేవలం 60 నుంచి 65 శాతం మంది వినియోగదారులు మాత్రమే ఈ-కేవైసీ పూర్తిచేశారని సమాచారం.
Gas Cylinder: నూరుశాతం ఈ-కేవైసీ పూర్తికాని కారణంగానే సిలిండర్ రీఫిల్లింగ్ ప్రక్రియలో పూర్తి పారదర్శకత లేదని వెల్లడైంది. అందుకే ఇప్పుడు ఈ-కేవైసీ నిబంధనను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఓటీపీ ఆధారిత డెలివరీ వ్యవస్థ పూర్తిగా అమలైతే మున్ముందు గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్, నకిలీ బుకింగ్‌లు, ఇతర అక్రమాలకు పెద్ద ఎత్తున చెక్ పెట్టవచ్చు.

