Game Changer: జనవరి 10న విడుదల కాబోతున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. డిసెంబర్ 30 ఈ మూవీని సెన్సార్ చేసిన కమిటీ యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చిందని సమాచారం. రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటించారు. రామ్ చరణ్ రైతుగా, ఐపీఎస్ అధికారిగా నటించాడని అంటున్నారు. ప్రతినాయకుడిగా ఎస్.జె. సూర్య నటించిన ‘గేమ్ ఛేంజర్’కు శంకర్ దర్శకుడు కాగా ఎస్.ఎస్. తమన సంగీతాన్ని సమకూర్చాడు. దిల్ రాజ్ బ్యానర్ నుండి రాబోతున్న ఈ 50వ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఇందులోని ఐదు పాటల్లో నాలుగు పాటలు ఇప్పటికే విడుదలయ్యాయి. మరో పాటను థియేటర్ లో చూస్తేనే ఫీల్ ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ పాటలకు దాదాపు 75 కోట్లు ఖర్చుపెట్టినట్టు తెలుస్తోంది. జనవరి 1న మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసి, 4న ఏపీలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపబోతున్నారు.