Farmers Protest: ఖానౌరీ సరిహద్దులో 35 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జిత్ దల్లేవాల్‌ను ఆసుపత్రిలో చేర్చడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. దీనికోసం పాటియాలా డీఐజీ, ఎస్‌ఎస్పీలతో పాటు మాజీ ఏడీజీపీ జస్కరన్ సింగ్ నేతృత్వంలోని పోలీసు బలగాలు రైతు నాయకులు, దల్లేవాల్‌తో మాట్లాడారు.
ఇది కూడా చదవండి: S. Somanath: జనవరిలో 100వ ప్రయోగానికి సిద్ధం ఐనా ఇస్రో
రైతు నాయకులు మాట్లాడుతూ- ఇది ఉద్యమాన్ని అంతం చేసే కుట్ర అని, మేము ఇక్కడ నుండి కదలబోమని అన్నారు. దల్లేవాల్ కూడా ఆసుపత్రికి వెళ్లేందుకు నిరాకరించారు. రైతు నేతల నుంచి వ్యతిరేకత రావడంతో చేసేదేమీ లేక బలగాలు వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. డిసెంబర్ 31లోగా దల్లేవాల్‌ను తాత్కాలిక ఆసుపత్రికి తరలించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలా జరగని పక్షంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీపై కోర్టు ధిక్కరణ కేసు పెట్టవచ్చు.
ఈ కేసు డిసెంబర్ 31న మరోసారి విచారణకు రానుంది. పంటల కనీస కొనుగోలు ధర (ఎంఎస్‌పి)కి హామీ ఇచ్చేలా చట్టం తీసుకురావాలని దల్లేవాల్ డిమాండ్ చేస్తున్నారు.