Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ సినిమాతో సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రం నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. క్యారెక్టర్ పోస్టర్లు, టీజర్, పాటలు ఇప్పటికే ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ సినిమా నుంచి తాజాగా మరో సర్ప్రైజ్ వచ్చింది. మోహన్‌లాల్ జన్మదినం (మే 21) సందర్భంగా ‘కన్నప్ప’ టీమ్ అద్భుతమైన గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ వీడియోలో మోహన్‌లాల్ స్క్రీన్ ప్రెజెన్స్, లుక్ అభిమానులకు గూస్బంప్స్ తెప్పిస్తోంది. కిరాత పాత్రలో ఆయన నటన, ఆకర్షణీయమైన తీరు ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉన్నాయి. దైవిక శక్తితో ముడిపడిన కిరాత పాత్రలో మోహన్‌లాల్ మరోసారి తన నటనా ప్రతిభను చాటనున్నారు. ప్రస్తుతం విష్ణు మంచు, ‘కన్నప్ప’ టీమ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉండగా, ఇప్పటికే యూఎస్ టూర్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ‘కన్నప్ప’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.

