Hyderabad: హైదరాబాద్‌లో ఒడిశా నుంచి వస్తున్న బస్సులో వెయ్యి గంజాయి చాక్లెట్లను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అనిల్‌కుమార్‌ను అరెస్టు చేశారు.
ఎక్సైజ్ సీఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. గంజాయి చాక్లెట్‌ను తీసుకొచ్చినట్లు పోలీసులకు పక్క సమాచారం అందడంతో.కోదాడ్ రాంపూర్ రోడ్డులో కావేరీ ట్రావెల్ బస్సును పోలీసులు ఆపారు. బస్సు లో తనిఖీలు చేయగా అధికారులకి వెయ్యి గంజాయి కలిపిన చాక్లెట్లను కనుగొన్నారు.
ఈ సోదాల్లో 1000 గంజాయి కలిపిన చాక్లెట్లు అమ్మకానికి తరలిస్తున్నటు అధికారులు గుర్తించారు. ఒడిశాకు చెందిన అనిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఒక్కో చాక్లెట్‌ను రూ.30 చొప్పున హైదరాబాద్‌లోని కూలీలకు గంజాయి చాక్లెట్‌ను ఆమెవడు అని విచారణలో తేలింది. అతని పైన కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.