Suchir Balaji Death

Suchir Balaji Death: అతడిది ఆత్మహత్యలా అన్పించట్లేదు..సుచిర్‌ బాలాజీ మరణంపై మస్క్‌ పోస్ట్‌

Suchir Balaji Death: గతంలో చాట్‌జీపీటీ మాతృ సంస్థ ‘ఓపెన్‌ ఏఐ’ మానవ సమాజానికి హానికరమని అని విమర్శలు చేసిన ఓపెన్ AI ఇంజనీర్ సుచిర్‌ బాలాజీ (26) హఠాత్తుగా మరణించడం టెక్‌ ప్రపంచంలో సంచలనంగా మారింది. అతని కుటుంబ సభ్యులు మరణం పట్ల అనుమానాలు వెక్తం చేస్తున్నారు. ఎలాన్‌ మస్క్‌ దీని పైన స్పందిస్తూ .. అతడిది ఆత్మహత్యలా అన్పించడం లేదన్నారు. 

సుజీర్ బాలాజీ, శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన యువ ఓపెన్ AI ఇంజనీర్. అతను నవంబర్ 26న తన అపార్ట్‌మెంట్‌లోని బాత్‌రూమ్‌లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా పోలీసులు ఆత్మహత్యగా నిర్ధారించారు. మృతి పట్ల కుటుంబ సభ్యులు అనుమానాలు  వెక్తం చేస్తున్నారు. సుజీర్ బాలాజీ తల్లి పూర్ణిమారావ్‌ సోషల్ మీడియా X లో ఓ పోస్ట్ పెటింది. అందులో తాము సుజీర్ బాలాజీ మృతదేహానికి ఓ ప్రైవేటు ఇన్వెస్టిగేటర్‌ను నియమించుకొని రెండోసారి పోస్టుమార్టం చేయించారు అని ఆమె తెలిపారు. వచ్చిన పరీక్ష ఫలితాలకి పోలీసులు చూపిన విషయాలకి పొంతన లేదు అని అన్నారు. 

ఇది కూడా చదవండి: Pawan Kalyan on Pushpa Issue: హీరోను ఒంటరి చేశారు.. పుష్ప ఘటనపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

సుజీర్ బాలాజీ అపార్ట్‌మెంట్‌ను ఎవరో దోచుకున్నట్లు కన్పిస్తోంది. బాత్‌రూమ్‌లో ఘర్షణ జరిగినట్టు కనిపించింది. అంటే కాకుండా అక్కడ రక్తం మరకలు కనిపించాయి. అతడిని కొట్టి హత్య చేసిఉంటారు అని అనుమానం వేక్తం చేశారు. గోరమైన హత్యను అధికారులు ఆత్మహత్య చేశారు అని పేర్కొన్నారు. తమకి నయం జరగాలి అని. దీనిపై ఎఫ్‌బీఐతో దర్యాప్తు జరిపించాలి’’ కోరారు. ఈ పోస్ట్‌ను ఎలాన్‌ మస్క్‌, భారత సంతతి నేత వివేక్‌ రామస్వామి, భారత విదేశాంగ శాఖకు ట్యాగ్‌ చేశారు. దీనిపై మస్క్‌ స్పందిస్తూ ‘అది ఆత్మహత్యలా అనిపించడం లేదు’ అని పోస్ట్‌ చేశారు.

ALSO READ  AP Rice Mafia: అడ్డంగా ఇరుక్కుపోయిన ద్వారంపూడి..రంగంలోకి CB-CID..

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *