ED Rides: తెలంగాణాలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది. హైదరాబాద్ లో 15 చోట్ల ఏకకాలంలో సోదాలు జరుపుతున్నారు. ఈ ప్రాంతాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అంతేహ్కాకుండా రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోని ఇద్దరు మంత్రులను ఈడీ టార్గెట్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. వారి నివాస స్ధలాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మంత్రులపై మనీలాండరింగ్ కు సంబంధించి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలోనే ఈదాడులు నిర్వహిస్తున్నారని చెబుతున్నారు.
Also Read: హైదరాబాద్ లో ఇకపై అర్ధరాత్రి 1 గంట వరకూ ఫుడ్ స్టాల్స్ ఓపెన్!
ED Rides: అప్పట్లో లోక్ సభ ఎన్నికల ముందు మంత్రి పొంగులేటి మరి కొందరు ప్రముఖులపై ఈడీ దాడులు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల తరువాత ఈడీ దాడుల జోరు తగ్గింది. కానీ, ఇప్పుడు ఒక్కసారిగా 15 ప్రాంతాల్లో ఈడీ దాడులకు దిగడంతో రాజకీయంగా కలకలం రేగుతోంది. ప్రస్తుతం మంత్రులే టార్గెట్ గా ఈడీ సోదాలు చేస్తుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

