cyber crime

Cyber Crime: ఆన్‌లైన్ వ్యాపారం.. నిండా మునిగిన డాక్టర్

Cyber Crime: ఆన్‌లైన్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే డబ్బు వస్తుందన్న ప్రచారం నమ్మి  నమ్మి ఓ వైద్యుడు కోటి రూపాయలు పోగొట్టుకున్నాడు. ఆన్‌లైన్ వ్యాపారానికి సంబంధించిన ప్రతిరోజూ సోషల్ మీడియాలో హోరెత్తుతున్నాయి.  ఈ ప్రకటనల్లో పేర్కొన్న రాబడి విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు . ఏది నిజమో.. అబద్ధమో తెలిసే పరిస్థితీ లేదు. చాలా మంది ఈ వ్యాపారంలో పెట్టుబడి పెట్టి నాశనం అవుతున్న వార్తలు నిత్యం వస్తూనే ఉన్నాయి. అయినా..  ఇప్పటికీ పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య మాత్రం తగ్గలేదు.

తాజాగా చెన్నైలోని ఓ ప్రభుత్వ వైద్యుడు ఇలాంటి ఆన్‌లైన్ ట్రేడింగ్‌పై ఆధారపడి రూ.76 లక్షలు పోగొట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.  చెన్నైలోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ తాజాగా ఆన్ లైన్ వ్యాపారానికి దొరికిపోయాడు. అతను ఆన్‌లైన్ వ్యాపార శిక్షణా కోర్సులు, ఆదాయం  గురించి యూట్యూబ్‌లో ఒక ప్రకటనను చూశాడు. దానిని చూసిన ఆయన అందులోని కాంటాక్ట్ నెంబర్ కు కాల్ చేశారు.  శిక్షణా కోర్సుల గురించి మరింత తెలుసుకోవడానికి డాక్టర్ సెల్ ఫోన్ నంబర్‌ను వాట్సాప్ గ్రూప్ లో చేర్చారు. దానికి అడ్మిన్ గా దివాకర్ సింగ్ అనే వ్యక్తి ఉన్నారు. గ్రూపులో ఉన్న చాలా మంది సభ్యులు తమను తాము సంపన్న వ్యాపారవేత్తలుగా.. పెట్టుబడిదారులుగా పరిచయం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి: YS Jagan: దొంగే దొంగ అన్నట్లుంది..చంద్రబాబుకు ఐదు ప్రశ్నలతో జగన్ ట్వీట్..!

Cyber Crime: ట్రైనింగ్‌లో చేరిన తొలినాళ్లలో ఆన్‌లైన్ ట్రేడింగ్ అంటే ఏమిటి, అందులో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏ స్టాక్‌లో ఎక్కువ లాభం వస్తుంది వంటి ప్రాథమిక అంశాలను పాఠాలుగా బోధించారు. ఇక గ్రూపులో ప్రతిరోజూ ఇతర సభ్యులు చాలా మంది తాము ఇన్వెస్ట్‌ చేశామనీ.. చాలా డబ్బు వచ్చిందని చెబుతూ 

తమ బ్యాంకు ఎకౌంట్ లో జమ అయిన మొత్తం, బ్యాంకు ఎకౌంట్  నంబర్, వంటి  వివరాలను స్క్రీన్ షాట్స్ గా పోస్ట్ చేశేవారు. దీంతో డాక్టర్ కూడా డబ్బును గ్రూప్ ఎడ్మిన్ చెప్పిన విధంగా ఇన్వెస్ట్ చేయడం కోసం డిపాజిట్ చేశారు. కొన్ని రోజులు లాభాలు వచ్చాయని చూపించి.. పెద్ద మొత్తంలో డబ్బు ఇన్వెస్ట్ చేయించిన తరువాత వాట్సాప్ గ్రూప్ డిలీట్ చేశారు కేటుగాళ్లు. మొత్తంగా ఆ డాక్టర్ కోటి రూపాయల వరకూ పోగొట్టుకున్నానని వాపోతూ సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Horoscope: ఈ రాశి వారు పిల్లల పట్ల అజాగ్రత్త వహించరాదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *