Divya Prabha

Divya Prabha: గుర్తింపు కోసం ఆ పని చేయలేదంటున్న దివ్య ప్రభ!

Divya Prabha: మలయాళ నటి దివ్య ప్రభ గత కొద్ది రోజులుగా విపరీతంగా వార్తలలో నానుతోంది. ‘ఆల్ వియ్ ఇమాజిన్ ఆజ్ లైట్’ అనే సినిమాలో ఆమె ఓ న్యూడ్ సీన్ లో నటించింది. ఈ సీన్ క్లిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గుర్తింపు కోసం తహతహలాడుతున్న దివ్య ప్రభ కావాలనే ఇలా నటించిందనే కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే వాటిని దివ్య ప్రభ ఖండించింది. న్యూడ్ సీన్ ఉంటుందని తెలిసే తాను ఈ సినిమా చేశానని, మూవీలో అది ఎంతో కీలకమైన సన్నివేశం అని, దానిని అర్థం చేసుకోకుండా తనపై అవాకులు చవాకులు పేలుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. విశేషం ఏమంటే… మే నెలలో కేన్స్ లో ప్రదర్శితమైన ఈ సినిమాకు అక్కడ అవార్డు కూడా వచ్చింది. దీనిని దేశవ్యాప్తంగా దగ్గుబాటి రానా పంపిణీ చేయబోతున్నాడు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Vikrant Massey: నటనకు విరామం ప్రకటించిన 12th Fail హీరో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *