Delhi: దేశవ్యాప్తంగా ఉపఎన్నికల ఫలితాలు: వివిధ రాష్ట్రాల్లో భిన్న పార్టీల విజయాలు

Delhi: దేశంలోని పలు రాష్ట్రాల్లో నిర్వహించిన ఉపఎన్నికల ఫలితాలు వెలువడగా, వివిధ పార్టీలకు కీలక విజయాలు లభించాయి. తెలంగాణ, రాజస్థాన్‌ల్లో కాంగ్రెస్ పార్టీ విజయపతాక ఎగరేసింది. జమ్మూకశ్మీర్, ఒడిశా ప్రాంతాల్లో మాత్రం బీజేపీ ఆధిపత్యం కొనసాగింది.

ప్రధాన ఫలితాలు ఇవి:

తెలంగాణ: కాంగ్రెస్ పార్టీ ఉపఎన్నికలో విజయాన్ని సాధించింది.

రాజస్థాన్: అంటలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రమోద్ గెలుపొందారు.

జమ్మూకశ్మీర్ – నగ్రోట: బీజేపీ అభ్యర్థి దేవయాని రాణా ఘన విజయం సాధించారు.

జమ్మూకశ్మీర్ – బ‌డ్గాం: పీడీపీ అభ్యర్థి సయ్యద్ ముంతజీర్ గెలుపు సాధించారు.

జార్ఖండ్ – ఘట్సిల: జేఎంఎమ్ అభ్యర్థి సోమేశ్ చంద్ర విజయం సాధించారు.

పంజాబ్ – తరణ్: ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి హర్మిత్ గెలిచారు.

మిజోరాం – డంప: ఎమ్‌ఎన్‌ఎఫ్ అభ్యర్థి లాల్ విజయం సాధించారు.

ఒడిశా – నౌపడ: బీజేపీ అభ్యర్థి జై దొలాకియా గెలుపొందారు.

ఈ ఉపఎన్నికల ఫలితాలు ప్రాంతాల వారీగా రాజకీయ పరిస్థితుల మార్పులను ప్రతిబింబిస్తున్నాయన్న విశ్లేషణ వెలువడుతోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *