Dear Krishna: అక్షయ్ హీరోగా, ‘ప్రేమలు’ ఫేమ్ మమిత బైజు హీరోయిన్ గా, ఐశ్వర్య మరో హీరోయిన్ గా నటించిన సినిమా ‘డియర్ కృష్ణ’. ఈ సినిమా ఇదే నెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఈ మూవీ బిగ్ టిక్కెట్ ను ఆది సాయికుమార్ చేతులమీదగా మేకర్స్ రిలీజ్ చేయించారు. ఆది సాయి కుమార్ ప్రస్తుతం ‘శంబాల’ మూవీలో నటిస్తున్నారు. ఆ సినిమా సెట్స్ కు వెళ్ళిన టీమ్ ఆది సాయికుమార్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిపించారు. ఈ సినిమాను ఆన్ లైన్ లో బుక్ చేసుకునే మొదటి వంద టిక్కెట్లలో ఒకరిని డిపింగ్ ద్వారా ఎంపిక చేసి పదివేల రూపాయల క్యాష్ బ్యాక్ ఇస్తామని నిర్మాత పి.ఎన్. బలరామ్ తెలిపారు. ఈ విధానాన్ని మొదటి వారం రోజులు కొనసాగిస్తామని అన్నారు. శ్రీకృష్ణుడికి, కృష్ణభక్తుడికి మధ్య జరిగిన విశేష సంఘటనల సమాహారంగా దినేశ్ బాబు ఈ సినిమాను తెరకెక్కించారు.
