Cyclone Senyar: మొన్న మొంథా తుఫాన్‌తో అతలాకుతలమైన రెండు తెలుగు రాష్ట్రాలు ఇంకా కోలుకోక ముందే మరో తుఫాన్ ముంచుకొచ్చే ప్రమాదం ఏర్పడింది. ఈ నెలలోనే కురిసిన మొంథా తుఫాన్ ప్రభావంతో ముఖ్యంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంటల దిగుబడులు వచ్చే తరుణంలో వచ్చిన వానలతో భారీ నష్టం చవిచూశారు. వరి, మక్క, పత్తి, సోయా పంటలతోపాటు మిరప, అరటి, ఇతర కూరగాయల తోటలకు పెద్ద ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాల్లో నష్టం వాటిల్లింది.
Cyclone Senyar: ప్రస్తుతం ఈ సేన్యార్ తుఫాన్ నవంబర్ 23 నాటికి అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇదే నెల 24 నాటికి వాయుగుండంగా బలపడి, 25 నాటికి తుఫాన్‌గా మారే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. 100 కిలోమీటర్ల వేగంతో గాలుల తీవ్రత ఉంటుందని తెలిపారు. సేన్యార్ తుఫాన్ అండమాన్ నుంచి ఒక పీడనంగా ఏర్పడిందని తెలిపారు. దీంతో నవంబర్ 26, 27, 28, 29, 30, డిసెంబర్ 1, 2 తేదీల్లో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
Cyclone Senyar: తమిళనాడు, చెన్నై, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు నుంచి కాకినాడ మధ్య, ఒడిశా నుంచి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ ప్రాంతాల్లో ఎక్కడైనా తీరాన్ని దాటవచ్చని వాతావరణ శాఖ సూచనలు అందుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. వరి పంటల దిగుబడులు సగం ఆఖరి దశలో ఉన్నందున, మిగతా సంగం కల్లాల్లో ఉన్నందున తడవకుండా కాపాడుకోవాలి. రోడ్లు, ఖాళీ స్థలాల్లో ఆరబెట్టిన ధాన్యం కుప్పల వద్ద తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

