Crime News:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిడదవోలు పట్టణానికి చెందిన ఓ యువతి హైదరాబాద్ నగరంలో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నది. నగరంలోని కూకట్‌పల్లి ప్రాంతంలోని ఓ హాస్టల్‌లో ఉంటున్నది. అదే హాస్టల్‌లో ఆమెకు చిన్ననాటి స్నేహితురాలైన అనూషాదేవి కూడా ఉంటున్నది. ఇద్దరూ జాబ్ చేస్తూ కలివిడిగా ఉండేవారు. హాయిగా ఉంటున్న తరుణంలో నిడదవోలు యువతికి అనుకోకుండా ఓ బెదిరింపు కాల్ వచ్చింది.
Crime News:నా వద్ద నీ న్యూడ్ వీడియోలు, ఫొటోలు ఉన్నాయి. ఇంటర్నెట్‌లో పెడతానని ఆ దుండగుడు నిడదవోలు యువతిని బెదిరించసాగాడు. ఏమి చేయాలో తోచకపోవడంతో తన స్నేహితురాలైన అనూషాదేవి భర్త నినావత్ దేవీనాయక్ అలియాస్ మధుసాయి కుమార్‌కు చెప్పుకున్నది. అప్పటికే అనూషాదేవి తన భర్తను తన స్నేహితురాలికి పరిచయం చేసింది.
Crime News:నిడదవోలు యువతికి ధైర్యం చెప్పిన దేవీనాయక్.. తాను ఆ మ్యాటర్‌ను సెటిల్ చేస్తానని, కెనడాలో ఉద్యోగం ఇప్పిస్తానని భరోసా ఇచ్చాడు. ఇంకా పలు సాకులు చెప్పిన దేవీనాయక్ ఆ యువతి వద్ద నుంచి రూ.2,53,76,000ను తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ యువతికి అసలు విషయం తెలిసింది. తన వద్ద న్యూడ్ ఫోటోలు ఉన్నాయని ఫోన్ చేసింది దేవీనాయక్ అని తెలిసిపోయింది.
Crime News:ఉద్యోగం లేక జులాయిగా తిరిగే దేవీనాయక్ జల్సాలకు అలవాటుపడ్డాడు. తన భార్య స్నేహితురాలైన బాధితురాలిని టార్గెట్ చేసుకున్నాడు. తన ఫోన్ నంబర్ నుంచి కాల్ చేస్తూ గుర్తు పడుతుందని, కొత్త సిమ్‌కార్డు తీసుకొని ఆ యువతికి కాల్ చేసి ఇలా బురిడీ కొట్టించాడు. తన స్నేహితురాలి భర్త తనను ఆదుకుంటాడనుకున్నది కానీ, ఇంతటి దారుణానికి ఒడిగడతాడని ఆ యువతి గ్రహించలేకపోయింది.
Crime News:ఈ మేరకు తాను మోసపోయినట్టు గుర్తించిన ఆ యువతి ఏపీలోని తన స్వస్థలమైన నిడదవోలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు దేవీనాయక్ నుంచి రూ.1,81,45,000 నగదును స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్టు చేశారు.