Crime News:సంగారెడ్డి జిల్లా కేంద్ర పరిధిలోని ఉత్తర్‌పల్లి సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన సోమవారం ఉదయం వెలుగు చూసింది. గ్రామ సమీపంలో ఉన్న ఫ్లిప్‌కార్ట్ కంపెనీ గోడౌన్‌కు కొద్ది దూరంలో గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురైన విషయాన్ని తొలుత గ్రామస్థులు గుర్తించారు. ఈ మేరకు గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందజేశారు. వారిచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందం వచ్చి ఆధారాలను సేకరించాయి.
Crime News:హత్యకు గురైన వ్యక్తికి 30 ఏండ్ల వయసు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మద్యం సీసాలు, పదునైన ఆయుధంతో కిరాతకంగా గొంతుకోసి గుర్తు తెలియని దుండగులు ఈ హత్యకు పాల్పడ్డారు. మృతుడి ఎడమ వైపు ఛాతీపై లత అనే పచ్చబొట్టు ఉన్నది. ఘటనా స్థలాన్నిసంగారెడ్డి డీఎస్పీ సత్తయ్యగౌడ్ పరిశీలించారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తామని, ఇతర ఆధారాలను సేకరించి త్వరలో వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు.