Cricket: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య ఉత్కంఠ భరితమైన మ్యాచ్‌లో, ఆస్ట్రేలియా జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 264 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరచి ఆసీస్ బ్యాటింగ్ లైనప్‌ను కట్టడి చేశారు.
ఆసీస్ ఇన్నింగ్స్ విశ్లేషణ
ఆస్ట్రేలియా జట్టు మంచి ప్రారంభం ఇచ్చినప్పటికీ, మధ్యవరుసలో వికెట్లు కోల్పోయి ఒత్తిడికి లోనైంది. ఓపెనర్లు ఆరంభంలో స్థిరంగా ఆడినా, భారత బౌలర్ల సున్నితమైన లైన్లు, లెంగ్త్ కారణంగా పెద్ద స్కోరు చేయలేకపోయారు.
టాప్ స్కోరర్లు:
స్మిత్ 96 బాల్స్ కు 73
సరే 57 బాల్స్ కు 61
హెడ్ 37 బాల్స్ కు 39
భారత బౌలర్లు మంచి ప్రదర్శన చూపించారు. ముఖ్యంగా, స్పిన్నర్లు పేసర్లు సమిష్టిగా రాణించారు.
ఈ ప్రదర్శనతో ఆసీస్ జట్టు 264 పరుగులకే పరిమితమైంది. భారత జట్టు విజయానికి 265 పరుగుల లక్ష్యంతో బరిలో దిగనుంది. భారత బ్యాటింగ్ ఎలా కొనసాగుతుందో చూడాలి!

