Costa Rica

Costa Rica: మా దేశంలో షూటింగ్స్ చేసుకోండి.. నిర్మాతలకు కోస్టా రికా ప్రతినిధి సోఫియా ఆహ్వానం!

Costa Rica: తమదేశం ఎన్నో పర్యాటక ప్రాంతాలను కలిగి ఉందని కోస్టా రికా దేశ అధికార ప్రతినిధి సోఫియా సలాస్ అన్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం నిర్మాతల మండలికి సంబంధించిన పలువురు ప్రముఖ నిర్మాతలను ఆమె ఈరోజు (సెప్టెంబర్ 25) కలిశారు. ఈ సందర్భంగా అందమైన తమ దేశంలో తెలుగు సినిమాల షూటింగ్స్ చేసుకోవాల్సిందిగా ఆహ్వానించారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రెటరీ దాము, నిర్మాతల మండలి సెక్రెటరీ తుమ్మల ప్రసన్న కుమార్, ప్రముఖ నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, రామ్ సత్యనారాయణ తదితరులకు తమ దేశంలో షూటింగ్స్ జరుపుకోవడానికి గల అద్భుత అవకాశాల గురించి వివరించారు సోఫియా.  

Costa Rica: తమ దేశంలో షూటింగుల కోసం అనుమతులు అన్ని సింగిల్ విండో విధానంలో ఇస్తామని ఆమె చెప్పారు. అంతేకాకుండా పన్ను రాయితీలు కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు నిర్మాతల మండలి తరుఫున సోఫియాను ప్రముఖ నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, రామ్ సత్యనారాయణ సన్మానించారు. కార్యక్రమంలో ఫ్యూజీ సాఫ్ట్వేర్ మనోహర్ రెడ్డి, తెలుగు ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దాము తో పాటు పలువురు నిర్మాతలు పాల్గొన్నారు. 

Costa Rica: తెలుగు ఫిలిం ఛాంబర్,  తెలుగు నిర్మాతల మండలి ప్రముఖులను కలవడం చాలా సంతోషంగా ఉందని సోఫియా అన్నారు. ఎప్పటి నుంచో మోహన్ ముళ్ళపూడితో పరిచయం ఉందని చెప్పారు.  తనను ఇక్కడకు ఆహ్వానించి తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్దలతో మీటింగ్ ఏర్పాటు చేసి సహకరిస్తున్నందుకు ఆయనకు ధన్యవాదములు తెలిపారు. నిర్మాతలు కోస్టా రిక దేశంలో షూటింగ్ చేయాలనుకునేవారు తెలుగు ఫిలిం ఛాంబర్ వారిని కలిసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు అని తెలియజేశారు.

Also Read: షూటింగ్ పూర్తి చేసుకున్న’ లైఫ్ (లవ్ యువర్ ఫాదర్)’మూవీ

Costa Rica: సోఫియా సలాస్ గురించి.. 

Costa Rica: సోఫియా సలాస్ అంతర్జాతీయ సహకారంలో తగినంత అనుభవం ఉన్న కోస్టా రికన్ న్యాయవాది. ఆమె యూనివర్శిటీ ఆఫ్ కోస్టా రిక నుండి లా డిగ్రీని,యూనివర్శిటీ ఆఫ్ ఎసెక్స్ (UK) నుండి మానవ హక్కుల ఇంటర్ డిసిప్లినరీ మాస్టర్స్ డిగ్రీని తీసుకున్నారు. సహాయం, రక్షణతో సహా అనేక రకాల సమస్యలపై అంతర్జాతీయ UN సంస్థలతో కలిసి ఆమె పనిచేస్తున్నారు. క్లిష్టమైన  పరిస్థితుల్లో వలసదారులకు, దేశాలకు మద్దతు ఇచ్చే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (SDGs) సాధన దిశగా 10 సంవత్సరాలకు పైగా స్థానికంగా అలాగే అంతర్జాతీయంగా పనిచేశారు. విదేశీ వ్యవహారాల, మంత్రిత్వ శాఖతో కోస్టా రికా రాయబార కార్యాలయంలో మంత్రి సలహాదారుగా,న్సుల్ జనరల్‌గా పనిచేశారు. అక్టోబర్ 2021లో భారతదేశంలోని న్యూ ఢిల్లీలోని కోస్టారికా రాయబార కార్యాలయం డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అండ్   కాన్సుల్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *