Chittoor: అభివృద్ధికి వేచి చూసి మోసపోయిన చిత్తూరు వాసులారా బాధపడకండి. మన బాధలు తీర్చడానికి గురుజాల జగన్మోహన్ రథచక్రాలు వస్తున్నాయి.1911 సంవత్సరంలో చిత్తూరు జిల్లా ఏర్పడినప్పటికీ అభివృద్ధిపై చిన్న చూపే చూశారు. పాలకులు తమిళనాడు, తిరుపతి నగరాలను మాత్రం అభివృద్ధి చేసేందుకు,పాలకులు ఎనలేని కృషి చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి పుణ్యమా అని తిరుపతి నేడు మహానగరంగా దిన దినాభివృద్ధి చెందుతూ ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన
పట్టణంగా రూపుదిద్దుకోవడం సంతోషకరమైనప్పటికీ, చిత్తూరును మాత్రం చిన్నచూపు చూడం బాధాకరం. చిత్తూరు జిల్లా ప్రధాన కేంద్రం అయినపటికీ అభివృద్ధి మాత్రం అంతంతమాత్రంగానే ఉంది.
Chittoor: ఇన్నాళ్లు పరిపాలించిన నాయకులు నాలుగు రాళ్లు వెనకేసుకునే కార్యక్రమమే చేశారు. కానీ చిత్తూరు అభివృద్ధికి దోహదపడలేదు. ప్రస్తుత ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తన స్వయంకృషితో బెంగళూరు వెళ్లి అనేక వ్యాపారాలు చేసి నాలుగు రాళ్లు వెనకేసుకున్నారు. తన తండ్రి అయిన చెన్నకేశవ నాయుడు మనతోపాటు నలుగురు బాగుండాలని జీజేఎం చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి సేవా కార్యక్రమాలు చేయాలని సూచించారు. తండ్రి కోరిక మేరకు చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి వెనుకేసుకున్న నాలుగురాళ్లతో నిరుపేదలకు పేదలకు ట్రస్టు ద్వారా అనేక సేవలందించారు. సేవ చేయడంలో ఉన్న ఆనందం మరెందులోనూ లేదని గ్రహించిన గురుజాల జగన్మోహన్ రాజకీయాల్లోకి రావాలని తరతరాలుగా అభివృద్ధికి నోచుకోని చిత్తూరును అభివృద్ధి వైపు నడిపించి… చిత్తూరులో పుట్టి పెరిగినందుకు జన్మస్థలానికి సేవలు అందించాలన్న భావనతో రాజకీయాల్లోకి రావడం. సీఎం
చంద్రబాబు ప్రోత్సాహం లభించడం జరిగింది.
ఇది కూడా చదవండి: Budget 2025: నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో ప్రీ బడ్జెట్ కీలక సమావేశం
Chittoor: చిత్తూరులోని ప్రముఖుల అందరిని కలుపుకొని కుల మత భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరి మన్ననలు పొందడం గొప్ప విశేషం… ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యే ఇవ్వనటువంటి కొత్త తరహా హామీలను ఇవ్వడంతో చిత్తూరు నియోజకవర్గం మొత్తం ఆయన హామీలకు ఆకర్షితులయ్యారు. గురజాల గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని చిత్తూరు వాసులకు పూర్తిస్థాయిలో నమ్మకం ఏర్పడడంతో ఆయనకు తిరుగు లేని విజయాన్ని కట్టబెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లను ప్రారంభించి పేదవారి ఆకలి తీరుస్తుందనీ ప్రకటించడంతో, రాష్ట్రంలోనే చిత్తూరు నియోజకవర్గంలో మొట్టమొదటి అన్న క్యాంటీన్ ప్రారంభించి పేదలకు తన సొంత నిధులతో కడుపు నింపిన కరుణామయుడుగా మారారు.
ఇది కూడా చదవండి: Manmohan Singh: యమునా నదిలో మన్మోహన్ చితాభస్మం
Chittoor: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అన్నా క్యాంటీన్లను ప్రారంభించేంతవరకు జీజేఎం సొంత నిధులతోనే నడిపించారు. ఆస్తులు అంతస్తులు డబ్బులు బంగారం ఎంత సంపాదించినా ఎప్పటికైనా మన నుంచి వెళ్లిపోవచ్చని ఒక్కసారి మనం సంపాదించినది మన నుంచి ఎప్పటికీ వెళ్ళని గొప్ప నిధి చదువు మాత్రమేనని గ్రహించిన గురజాల, కేంద్రీయ విద్యాలయ చిత్తూరు రావడానికి కృషి చేశారు. ఒడి ఒడిగా అడుగులు వేస్తూ చిత్తూరు అభివృద్ధికి కృషి చేస్తూ ముందుకు సాగుతున్నారు. వేసవిలో నీటి ఎద్దడితో చిత్తూరులో ఎన్నో వార్డుల్లో నీళ్ల ట్యాంకుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నుంచి వార్డుల్లో 47 బోర్లు వేయించి ప్రజల నీటి కన్నీటి బాధలను తీర్చిన జల ప్రదాతగా మన్ననలు పొందారు. చిత్తూరు ఏ వార్డు చూసినా ఏమున్నది పారిశుధ్యం రోడ్ల మొత్తం గుంతలమయం చినుకు పడితే నియోజకవర్గం మొత్తం చిత్తడి చిత్తడి మారి మారుమూల గ్రామాలను తలపించే విధంగా ఉండేది. ప్రతి వార్డులోనూ తిరిగి వారి సమస్యలను గుర్తించి అటు పారిశుద్ధ్య రోడ్లు వేయించేందుకు 10 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించే విధంగా కృషి చేసిన కృషిపలుడు మన జగన్మోహనుడు.
Chittoor: తరతరాలుగా ఎవరికి, ఏ ప్రభుత్వానికి సాధ్యం కానీ ప్రధాన రహదారి విస్తీర్ణ పనులు వాటికి సంబంధించిన సమస్యలను సామరస్యంగా అందరికీ ఆమోదయోగంగా అన్ని వర్గాలకు సమన్వయపరిచి వారందరినీ ఏకతాటి మీదకు తీసుకొని వచ్చి ఒప్పించి, మెప్పించి చిత్తూరు చిరకాల వాంఛను నెరవేరుస్తూ చిత్తూరు నగరాన్ని అభివృద్ధి వైపుకు పరుగులు తీస్తూ గురజాల జగన్మోహన్ రథచక్రాలు. చిత్తూరు దాహార్తిని తీర్చేందుకు అడవిపల్లె రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రిని ఒప్పించి నీటిని తీసుకురావడానికి కృషి చేస్తున్న జల ప్రదాత గురజాల జగన్మోహన్. కూటమి నాయకులను అందరినీ కలుపుకొని వ్యాపారులను అన్ని వర్గాల వారిని ప్రతి ఒక్కరికి ఆమోదయోగమైన పనులు చేస్తూ చిత్తూరు అభివృద్ధి వైపున పరుగులు తీయిస్తూ ముందుకు వెళుతున్నటువంటి గురజాల జగన్మోహన్‌కి ప్రతి ఒక్కరూ సహకరించి. చిత్తూరు అభివృద్ధికి మరింత కృషి చేసే విధంగా ఆయన ప్రోత్సహించాలని. చిత్తూరు వాసులు కోరుతున్నారు.
ఇది రాసినవారు
కె. మోహన్…చిత్తూరు & తిరుపతి జిల్లా ప్రతినిధ