Supreme Court: కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని ఉద్యోగులు, అధికారులకు సంబంధించిన కేసులను రాష్ట్ర దర్యాప్తు సంస్థలు విచారించవచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ మధురై సబ్ జోనల్ కార్యాలయంలో అధికారిగా అంకిత్ తివారీ పనిచేశారు.
గత ఏడాది డిసెంబర్ 1న రాష్ట్ర ప్రభుత్వ అధికారి నుంచి రూ.20 లక్షలు లంచం తీసుకుంటుండగా తమిళనాడు లంచ నిరోధక పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన బెయిల్ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ఇది కూడా చదవండి:EPFO: గుడ్ న్యూస్.. పీఎఫ్ డబ్బులు కూడా ఏటీఎం నుంచి తీసుకోవచ్చు!
Supreme Court: ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అంకిత్ తివారీని తమ కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణకు వచ్చినపుడు కేంద్ర ప్రభుత్వ అధికారులు నేరాలకు పాల్పడినప్పుడు, దానిని కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా దర్యాప్తు చేయవచ్చు. అలాగే రాష్ట్ర దర్యాప్తు సంస్థలు కూడా దర్యాప్తు చేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు అస్సలు దర్యాప్తు చేయకూడదని మేం చెప్పడం లేదు అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.
ఈ కేసులో అంకిత్ తివారీకి మంజూరైన మధ్యంతర బెయిల్ పొడిగించారు. కేసు పెండింగ్‌లో లేనప్పుడు మధ్యప్రదేశ్‌లో అతని కుటుంబంతో ఉండటానికి అనుమతి ఉంది. కానీ దర్యాప్తు సంస్థలు సమన్లు పంపినప్పుడు, ట్రయల్ కోర్టుకు క్రమం తప్పకుండా హాజరు కావాలి. అని షరతులు విధించింది కోర్టు.