Breaking News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శనివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. రాష్ట్రంలోని విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు దుర్మరణం పాలయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.