TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వ్యవహారాలపై టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి మీడియా సమావేశంలో తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ హయాంలో టీటీడీ వ్యవహారాలు దారుణంగా మారాయని ఆయన విమర్శించారు.
టీటీడీ దేవస్థానాలను వైసీపీ ఎస్టేట్‌లుగా మార్చారని తీవ్ర ఆరోపణ చేశారు.టీటీడీలో అక్రమాలకు పాల్పడిన వారిని వదిలేయడం ద్వారా ప్రభుత్వానికి చెందిన వ్యక్తులు వారికి సహకరించారని చెప్పారు.భక్తులు సమర్పించిన విరాళాలను దుర్వినియోగం చేసి ప్రజలను మోసం చేశారని విమర్శించార.
భానుప్రకాష్‌రెడ్డి ప్రకారం, టీటీడీ విజిలెన్స్ విభాగ అధికారి శివశంకర్ అక్రమాలకు పాల్పడ్డారని, కానీ అధికారుల నుండి ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. శివశంకర్‌పై కేసులు నమోదు చేయడంలో నిర్లక్ష్యం చూపారని ఆయన ఆరోపించారు.
టీటీడీ పాలనలో ఉన్న అవినీతి, అక్రమాలపై ప్రభుత్వ స్పందన లేకపోవడం విచారకరమని భానుప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. వైసీపీ హయాంలో భక్తుల విశ్వాసానికి తూట్లు పొడిచారని, ప్రజలు దీనిపై న్యాయం కోరాలని పిలుపునిచ్చారు.