Benjamin Netanyahu: ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు షెడ్యూల్ చేసిన తన భారతదేశ పర్యటనను వాయిదా వేసుకున్నట్లు అంతర్జాతీయ, ఇజ్రాయెల్ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట (లాల్ ఖిలా) ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో, భద్రతాపరమైన ఆందోళనల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. నెతన్యాహు పర్యటనకు ముందు, దేశ రాజధానిలో జరిగిన ఈ దాడి ఇజ్రాయెల్ భద్రతా బృందాలను కలవరపరిచింది. ఇజ్రాయెల్ అత్యున్నత భద్రతా ప్రమాణాలకు ప్రసిద్ధి చెందింది కాబట్టి, భారత పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై వారు పునఃపరిశీలన చేయాల్సి వచ్చింది.
ఇది కూడా చదవండి: Karimnagar: దుబాయిలో రెండేళ్లుగా ఆచూకీ లేదు.. భర్త కోసం కలెక్టర్‌కు మొరపెట్టుకున్న భార్య!
ఇజ్రాయెల్ మీడియా కథనాల ప్రకారం, ప్రధాని కార్యాలయం పర్యటనను రద్దు చేయలేదు, కానీ దానిని వాయిదా వేసింది. “ప్రధానమంత్రి నెతన్యాహు ఇప్పుడు పర్యటనను రద్దు చేయడం కంటే, భారతదేశం లనూతన భద్రతా ఏర్పాట్లను పూర్తిగా సమీక్షించి, తర్వాత తేదీని ఖరారు చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉంది.
” ఇరు దేశాల మధ్య బలమైన వ్యూహాత్మక సంబంధాలు ఉన్నందున, ఈ వాయిదా కేవలం తాత్కాలికమేనని, భద్రతకు సంబంధించి ఇజ్రాయెల్ పూర్తి స్పష్టత పొందిన తర్వాత త్వరలోనే పర్యటన మళ్లీ ఖరారవుతుందని దౌత్య వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

