Bank Holidays: ఆర్‌బీఐ క్యాలెండర్ ప్రకారం 2025 జనవరి నెలలో బ్యాంకులకు 15 సెలవులు ఉంటాయి. ఇందులో ఆదివారం, రెండు శనివారాలు సెలవులు ఉన్నాయి. సంక్రాంతి, గురుగోవింద్ జయంతి, సుభాష్ చంద్రబోస్ జయంతి మొదలైన సెలవులు ఉన్నాయి. జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈ ఏడాది ఆదివారం నాడు. జనవరి 11 నుంచి 16 వరకు వరుస సెలవులు ఉన్నాయి.
జనవరి 2025లో బ్యాంక్ సెలవులు
జనవరి 1, బుధవారం: నూతన సంవత్సరం
జనవరి 2, గురువారం: నూతన సంవత్సరం (మిజోరం రాష్ట్రంలో సెలవు)
జనవరి 5: ఆదివారం సెలవు
జనవరి 6, సోమవారం: గురు గోవింద్ జయంతి (పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో సెలవు)
జనవరి 11: రెండవ శనివారం
జనవరి 12: ఆదివారం సెలవు
జనవరి 13, సోమవారం: లోహ్రీ పండుగ (పంజాబ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో సెలవు)
జనవరి 14, మంగళవారం: సంక్రాంతి, పొంగల్ పండుగ (తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడుతో సహా అనేక రాష్ట్రాల్లో సెలవులు)
జనవరి 15, బుధవారం: తిరువల్లువర్ దినోత్సవం, మాఘ బిహు (తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాంలో సెలవు)
జనవరి 16, గురువారం: కనుమ పండుగ (అరుణాచల్ ప్రదేశ్‌లో సెలవు)
జనవరి 19: ఆదివారం సెలవు
జనవరి 23, గురువారం: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి (చాలా రాష్ట్రాల్లో సెలవు)
జనవరి 25: నాల్గవ శనివారం సెలవు
జనవరి 26: ఆదివారం సెలవు
జనవరి 30, గురువారం: సోనమ్ లోసర్ పండుగ (సిక్కింలో సెలవు)
బ్యాంకులు మూతపడినప్పటికీ, చాలా వరకు బ్యాంకింగ్ సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ఏటీఎంలు కూడా 24 గంటలు తెరిచి ఉంటాయి. అందువల్ల, బ్యాంకులకు సెలవులు పెద్దగా ప్రభావితం చేయవు. డిమాండ్ డ్రాఫ్ట్, చెక్కు తదితర కొన్ని పనుల కోసం తప్పనిసరిగా బ్యాంకు కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది.