Akhanda 2 Balakrishna

Akhanda 2 Balakrishna: శివుడి తాండవం చూస్తారు.. సినిమాపై హైప్ పెంచేసిన బాలకృష్ణ

Akhanda 2 Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ (ఎన్‌బికె) అభిమానులకు కనుల పండుగగా, హైదరాబాద్ వేదికగా అఖండ 2 సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, సాంకేతిక నిపుణులు, నటీనటులతో పాటు వేలాది మంది నందమూరి అభిమానుల సమక్షంలో ఈ వేడుక చిరస్మరణీయంగా నిలిచింది.

ఈ సందర్భంగా, బాలయ్య బాబు తన ప్రసంగంతో అభిమానులలో ఉత్సాహాన్ని పదింతలు పెంచారు. సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరినీ పేరుపేరునా గుర్తుచేసుకుంటూ, వారితో తనకున్న అనుభవాలను పంచుకుంటూ మాట్లాడారు. అయితే, ఈ వేదికపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. ఆయన స్వయంగా అఖండ 2 కథా నేపథ్యాన్ని సూచిస్తూ ఒక కీలకమైన ప్రకటన చేశారు.

రుద్ర తాండవం, త్రినేత్రుడి వీక్షణమే ‘అఖండ 2’ పవర్‌:

సినిమా కథ గురించి పూర్తిగా చెప్పకుండానే, బాలకృష్ణ తన పాత్ర తీరును వివరిస్తూ సినిమా థీమ్‌ను స్పష్టం చేశారు. ఆయన మాటల్లోనే..ఈ సినిమాలోని రుద్ర తాండవ విన్యాసం నాలో ఆవేశమై, అలాగే ఆ త్రినేత్రుడి వీక్షణ దృష్టి నాలో నిక్షిప్తమై, నాగ బంధన భయంకరమైన క్రోధం నా ఉచ్ఛ్వాసనిచ్వాసలై.. ఇంకా ఆయన త్రిశూలం నా ఆయుధానికి శక్తి సౌర్యమై ఎలా ఉంటుందో… నా పాత్ర అలా ఉంటుంది!

ఇది కూడా చదవండి: Horoscope Today: మీ కష్టానికి ప్రతిఫలం దక్కే రోజు.. డబ్బులు కుప్పలు కుప్పలు

ఈ ఒక్క వాక్యంతో, ‘అఖండ’ మొదటి భాగంలో కనిపించిన శివతత్వం, ఆగ్రహం, పరాక్రమం మరింత ఉన్నత స్థాయిలో ‘అఖండ 2’లో ఉండబోతున్నాయని స్పష్టమవుతోంది. త్రినేత్రుడు, రుద్రుడు, త్రిశూలం వంటి ప్రస్తావనలు బాలకృష్ణ పాత్ర కేవలం సాధారణమైనది కాదని, అది అసాధారణమైన దైవశక్తితో కూడిన పవర్ ఫుల్ అవతారంలా ఉంటుందని అభిమానులకు సంకేతం ఇచ్చాయి.

సినిమాపై అంచనాలు ఆకాశంలో:

బాలకృష్ణ చేసిన ఈ ప్రకటనతో అఖండ 2 ఒక అత్యద్భుతమైన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. చిత్రబృందంపై, ముఖ్యంగా దర్శకుడిపై బాలకృష్ణ చూపిన అభిమానం, అలాగే ఆయన పాత్ర గురించి చెప్పిన తీరు చూస్తుంటే… ఈ సీక్వెల్ మొదటి భాగాన్ని మించిన విజయాన్ని సాధించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరి, ‘రుద్ర తాండవం’ ఆవేశం నింపుకున్న ఈ పాత్ర బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి చరిత్ర సృష్టిస్తుందో చూడాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే!

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *