Ayush Mhatre

Ayush Mhatre: రోహిత్ శర్మ రికార్డు బద్దలుకొట్టిన 18 ఏళ్ల ఆటగాడు!

Ayush Mhatre: ముంబైకి చెందిన 18 ఏళ్ల యువ బ్యాట్స్‌మెన్ ఆయుష్ మ్హాద్రే భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న చారిత్రక రికార్డును బద్దలు కొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా విదర్భతో జరిగిన మ్యాచ్‌లో ఆయుష్ విధ్వంసకరమైన తొలి టీ20 సెంచరీ సాధించి, ముంబైకి ఏడు వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ లక్నోలోని ఏకానా క్రికెట్ స్టేడియంలో జరిగింది.

కేవలం 18 సంవత్సరాల 135 రోజుల వయస్సులో, ఆయుష్ మ్హాద్రే టీ20లు, ఫస్ట్-క్లాస్ క్రికెట్చ, లిస్ట్ A క్రికెట్ అనే మూడు ఫార్మాట్‌లలోనూ సెంచరీ సాధించిన ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన బ్యాట్స్‌మెన్ గా నిలిచాడు. ఈ ఘనతతో, అతను గత 19 సంవత్సరాలుగా రోహిత్ శర్మ (19 సంవత్సరాల 339 రోజులు) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. ఆయుష్ కంటే ముందు ఈ జాబితాలో రోహిత్ శర్మ, ఉన్ముక్త్ చంద్, క్వింటన్ డి కాక్, అహ్మద్ షెహజాద్ వంటి ప్రముఖులు ఉన్నారు.

ఇది కూడా చదవండి: WPL Full Schedule Released: WPL 2026 పూర్తి షెడ్యూల్‌ విడుదల

మూడు ఫార్మాట్‌లలో అతి పిన్న వయస్కుల సెంచరీ వీరులు:

ఆయుష్ మ్హాద్రే – 18 సంవత్సరాల 135 రోజులు

రోహిత్ శర్మ – 19 సంవత్సరాల 339 రోజులు

ఉన్ముక్త్ చంద్ – 20 సంవత్సరాలు

తన టీ20 కెరీర్‌లో తొలి సెంచరీని నమోదు చేసిన మ్హాద్రే.. కేవలం 49 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 సిక్స్‌లు, 8 ఫోర్లు ఉన్నాయి. భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఆయుష్ దూకుడుగా ఆడి ముంబై జట్టును విజయపథంలో నడిపించాడు. ఆయుష్ మ్హాద్రే ఈ రికార్డును నెలకొల్పిన రోజే, రాబోయే అండర్-19 ఆసియా కప్ కోసం ప్రకటించిన 15 మంది భారత జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గతంలో సెప్టెంబర్, అక్టోబర్‌లో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా కూడా మ్హాద్రే భారత U19 జట్టుకు నాయకత్వం వహించాడు. ఈ టోర్నమెంట్ డిసెంబర్ 12 నుంచి 21 వరకు దుబాయ్‌లో 50 ఓవర్ల ఫార్మాట్‌లో జరగనుంది. భారత్ తమ తొలి మ్యాచ్‌ను డిసెంబర్ 12న ఆడుతుంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ డిసెంబర్ 14న జరగనుంది. సెమీఫైనల్స్ డిసెంబర్ 19న, ఫైనల్ డిసెంబర్ 21న జరగనున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *