Delhi Elections

Delhi Elections: అర్చకులకు ప్రతినెలా 18వేలు ఇస్తాం.. ఎవరన్నారంటే.

Delhi Elections: ఢిల్లీలో తమ పార్టీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే పూజారి గ్రంథి సమ్మాన్ యోజనను ప్రారంభిస్తామని ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ప్రకటించారు. ఇందులో భాగంగా ఆలయ అర్చకులకు, గురుకుల అర్చకులకు ప్రతినెలా రూ.18 వేలు భృతి ఇస్తారు.ఈ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ మంగళవారం ప్రారంభమవుతుందని కేజ్రీవాల్ తెలిపారు. కేజ్రీవాల్ మంగళవారం కన్నాట్ ప్లేస్‌లోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆయన అక్కడ దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను  తనిఖీ చేస్తారు.

 ఇదిలా ఉండగా, ఢిల్లీ వక్ఫ్ బోర్డు ఇమామ్‌లు కేజ్రీవాల్ ఇంటి వెలుపల ప్రదర్శన చేశారు. తమకు 17 నెలలుగా జీతాలు అందడం లేదని ఇమామ్‌లు పేర్కొంటున్నారు. ఇందుకోసం సీఎం, ఎల్జీ సహా అందరికీ ఫిర్యాదు చేశారు. కేజ్రీవాల్ మాట్లాడుతూ పూజారులు,  గ్రాంథిలు సమాజంలో ముఖ్యమైన భాగమని, అయితే వారి సమస్యలను తరచుగా విస్మరించారని అన్నారు. మహిళా సమ్మాన్‌, సంజీవని యోజన రిజిస్ట్రేషన్‌ను ఆపేందుకు బీజేపీ వ్యక్తులు విఫలయత్నం చేశారు. ఇప్పుడు ఈ వ్యక్తులు అర్చక-గ్రంధి సమ్మాన్ యోజన నమోదును ఆపకూడదు అని చెప్పారు. దీనిని ఆపితే పాపం చేసినట్టే అని పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండి: Manmohan Singh: మన్మోహన్ మరణం.. కాంగ్రెస్ బీజేపీల రాజకీయ సమరం..

Delhi Elections: ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రకటన గాలివాన అని బీజేపీ పేర్కొంది. కేజ్రీవాల్ అర్చక-గ్రంధి సన్మాన పథకానికి సంబంధించి, బిజెపి అధికార ప్రతినిధి అమిత్ మాల్వియా మాట్లాడుతూ, 10 సంవత్సరాల తరువాత, గొప్ప మోసగాడు అరవింద్ కేజ్రీవాల్ దేవాలయాల పూజారులను, గురుద్వారా సాహిబ్ గ్రంథీలను మోసం చేయడానికి కొత్త పథకాన్ని ప్రకటించారని అన్నారు. అయితే ఢిల్లీలో ఎంత మంది పూజారులు, గ్రంధులు ఉన్నారో కూడా వారికి తెలియదు అని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు అసత్య వాగ్దానాలు చేస్తున్నారంటూ మండి పడ్డారు. మరోవైపు అమిత్ షా తన ఎక్స్ పోస్ట్‌లో గత 17 నెలలుగా ఇమామ్‌లకు జీతాలు కూడా చెల్లించలేదు. దీనికోసం  వారు నిరంతరం నిరసనలు చేస్తున్నారు. ఆప్ చేసిన ఈ హిందూ ప్రకటన కూడా కేవలం గాలిలో చేస్తున్నదే అని  ఢిల్లీ ప్రజలకు తెలుసు అంటూ వ్యాఖ్యానించారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Fake Documents: నకిలీ డాక్యుమెంట్స్ తో బ్యాంక్ అకౌంట్స్.. ముఠా అరెస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *