AP Crime News: విజయవాడలో స్నేహం పేరుతో ఓ బాలిక (14)ను ట్రాప్ చేసి మూడు రోజులపాటు నిర్బంధించి ముగ్గురు దుండగులు సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటనను మరువక ముందే.. అల్లూరి జిల్లాలో మరో దారుణం చోటుచేసుకున్నది. ఇక్కడ కూడా మాయమాటలు చెప్పి బాలికను తీసుకెళ్లి ముగ్గురు దుండగులు మూడు రోజులపాటు తమ వెంట తీసుకెళ్లి లైంగిక వాంఛలు తీర్చుకున్నారు.
AP Crime News: అల్లూరి జిల్లా జీ మాడుగుల మండల పరిధిలో ఉన్న ఓ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు చెందిన ఓ బాలికను ట్రాప్ చేసి ముగ్గురు సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ పాఠశాలలో చదువుతున్న బాలిక ఉన్నట్టుండి డిసెంబర్ 25న అదృశ్యమైంది. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలిసి డిసెంబర్ 28న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు అదేరోజు సాయంత్రం పాడేరులో బాలికను గుర్తించారు.
AP Crime News: పోలీసుల విచారణలో అసలు విషయాలు వెల్లడయ్యాయి. జీ మాడుగుల మండలంలో వేర్వేరు గ్రామాలకు చెందిన కొర్రా మల్లీశ్వరరావు (22), వంతాల సన్యాసిరావు (24)తోపాటు మరో 16 ఏండ్ల బాలుడు కలిసి ఆ బాలికకు మాయమాటలు చెప్పి పాడేరుకు తీసుకెళ్లారని, అక్కడే తనపై సామూహిక లైంగికదాడికి పాల్పడినట్టు ఆ బాలిక పోలీసులకు తెలిపింది.
AP Crime News: బాలికను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు.. నిందితులపై పోక్సో కేసు నమోదు చేసినట్టు తెలిపారు. వీరిలో నిందితుడు వంతాల సన్యాసిరావును అరెస్టు చేయగా, మిగతా ఇద్దరు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. నిందితులకు కఠిన శిక్షలు విధిస్తామని బాధిత కుటుంబానికి పోలీసులు హామీ ఇచ్చారు.