Mohan Babu: ఇప్పటికే ఇంటి రచ్చతో జర్నలిస్టు పై దాడి చేసి ఇబ్బందుల్లో పడిన మంచు మోహన్ బాబు మరో వివాదంలో చిక్కుకున్నట్టు కనిపిస్తోంది. ఆయన సిబ్బంది జల్ పల్లి అటవీ ప్రాంతంలో అడవి పందులను వేటాడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అడవి పందిని వేటాది తీసుకెళ్లినట్లు మేనేజర్ కిరణ్ పై ఆరోపణలు రావడమే కాకుండా, అక్కడ పనిచేసే ఎలక్ట్రీషియన్ దుర్గాప్రసాద్ అడవి పందిని బంధించి తీసుకువెళుతున్న వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. మంచు మనోజ్ చాలా సార్లు కిరణ్, దుర్గా ప్రసాద్ ల చర్యలను తప్పు పడుతూ అభ్యంతరం చెప్పినట్టు తెలుస్తోంది. అడవి పందులను వేటాడొద్దు అంటూ మంచు మనోజ్ వారించినా పట్టించుకోకుండా మేనేజర్ కిరణ్, ఎలక్ట్రీషియన్ దుర్గా ప్రసాద్ అదే పని చేస్తున్నారని అంటున్నారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివాదంపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది. ఈ వార్త అప్ డేట్ అవుతుంది.