Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాణాంతక కీటకం ఆందోళనకు గురిచేస్తున్నది. ఆ కీటకం కుట్టడంతో వచ్చే కొత్త వ్యాధి కలకలం రేపుతున్నది. స్క్రబ్ టైఫస్ అనే కీటకం కుట్టడంతో అనారోగ్యంతో ఓ మహిళ మృతి చెందడంతో మరింత ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో ఆ కీటకం కుట్టడంతో 1317 స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలుస్తున్నది.
Andhra Pradesh:విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం మిట్టపల్లి గ్రామంలో రాజేశ్వరి (36) అనే మహిళ గత కొంతకాలంగా జ్వరంతో బాధపడుతున్నది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా స్క్రబ్ టైఫస్ సోకిందని అక్కడి వైద్యులు నిర్ధారించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగానే ఆమె పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది.
Andhra Pradesh:ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి అన్ని జిల్లాలకు వ్యాపిస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో 379, కాకినాడలో 141, విశాఖపట్నం 123, వైఎస్సార్ కడప 94, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు 86, అనంతపురం 68, తిరుపతి 64, విజయనగరం 59, కర్నూలు 42, అనకాపల్లి 41, శ్రీకాకుళం 34, అన్నమయ్య 32, గుంటూరు 31, నంధ్యాల జిల్లాలో 30 చొప్పున ఈ స్క్రబ్ టైఫస్ కేసులు నమోదయ్యాయి.
Andhra Pradesh:ఈ వ్యాధి నిర్ధారణ జరిగితే యాంటీ బయాటిక్స్ మందులతో నయం అవుతుందని వైద్యులు తెలిపారు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. అస్వస్థతకు గురవగానే నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఈ వ్యాధితో రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేస్తున్నారు.

