Whittier Alaska: ఒక టౌన్ అంటే ఎంత ఉంటుంది. కనీసం ఓ 10 మైళ్ళ వైశాల్యంతో తక్కువ అనుకుంటే 5 మైళ్ళ వైశాల్యంతో ఉంటుంది. టౌన్ అంటే కనీసం తక్కువలో తక్కువ ఓ ఐదారువందల ఇళ్ళు ఉంటాయి. అంతేకాదా. అలాగే పోస్టాఫీస్.. గుడి.. స్కూల్.. పార్క్.. సినిమా హాలు.. ఇలా ఎన్నో భవనాలు ఉంటాయి. ఇన్ని హంగులు ఉంటేనే టౌన్ అనే భ్రమలో మీరుంటే తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ప్రపంచంలో ఒకే అపార్ట్మెంట్ లో ఒక టౌన్ ఉంది. అంతేకాదు.. టౌన్ లో ఉండే సదుపాయాలనీ ఒకే అపార్ట్మెంట్ లో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఒకే కప్పుకింద ఉండే పట్టణం అది. ఈ అపార్ట్మెంట్ టౌన్ ఎక్కడుందో.. ఎలా ఉంటుందో చెప్పేసుకుందాం రండి.
అమెరికాలోని అలాస్కాలో విట్టీర్ అనే పేరుతో ఒక ప్రత్యేకమైన నగరం ఉంది. అక్కడ ప్రజలందరూ ఒకే భవనంలో నివసిస్తున్నారు. అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్న ఈ 14 అంతస్తుల భవనం పేరు బెగిచ్ టవర్. అలాస్కాలోని ఈ టౌన్ ప్రత్యేకమైన టౌన్ గా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. ఈ ఒక్క భవనంలో పోలీస్ స్టేషన్, హాస్పిటల్, చర్చి నుండి కిరాణా దుకాణం, లాండ్రీ వరకు అన్నీ ఒకే పైకప్పు క్రింద ఉన్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో విట్టియర్ అనే పాఠశాల ఉంది,స్కూల్ కూడా ఉంటుంది. ఇక్కడ టౌన్ లోని పిల్లలందరూ చదువుతున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ ఒక సొరంగం ద్వారా కలిపి ఉంటుంది. దీనివలన ఎప్పుడైనా వాతావరణం గందరగోళంగా ఉన్నాసరే బిల్డింగ్ బయటకు రాకుండా స్కూల్ కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే, గట్టిగా వర్షం వస్తే మన దగ్గర సెలవు ఇచ్చినట్టు అక్కడ పిల్లలకు సెలవు ఇచ్చే అవసరం లేదన్నమాట.
ఇది కూడా చదవండి: AP Crime News: అల్లూరి జిల్లాలో దారుణం.. బాలికపై సామూహిక లైంగికదాడి
సమాచారం ప్రకారం, ట్రేడింగ్ టవర్ మొదటి అంతస్తులో టౌన్ నడపడానికి అవసరమైన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఒకవైపు పోస్టాఫీసు, మరోవైపు పోలీస్ స్టేషన్ ఉన్నాయి. అదే సమయంలో ప్రభుత్వ కార్యాలయాలు కొద్ది దూరంలోనే కనిపిస్తాయి. 2023 డేటా ప్రకారం, ఈ టౌన్ మొత్తం జనాభా 263 మంది ఉన్నారు.
Whittier Alaska: ఇలా ఎందుకుందంటే..
అలాస్కాలోని ఈ ప్రాంతంలో వాతావరణం చాలా సవాలుగా ఉంటుంది. ఒక్కోసారి ఇక్కడి ప్రజలు భవనం నుండి బయటకు వచ్చే అవకాశం కూడా ఉండదు. ఇక్కడ కొన్నిసార్లు గంటకు 60 మైళ్ల వేగంతో గాలులు వీస్తాయి. ఇక మంచు అయితే.. 250 నుండి 400 అంగుళాల వరకు ఉంటుంది.
ఈ భవనాన్ని 1956లో నిర్మించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో దీనిని ఆర్మీ బ్యారక్‌గా ఉపయోగించారు. తరువాత దీనిని అపార్ట్‌మెంట్‌లుగా మార్చారు. దీనిలో మొత్తం టౌన్ ఇప్పుడు నివాసం ఉంటోంది. విట్టీర్ సిటీ మోడల్ ఆధునిక సమాజానికి ప్రేరణ కంటే తక్కువ కాదు. ఇక్కడ పరిమిత వనరులు. సవాలుతో కూడిన పరిస్థితుల నేపథ్యంలో కూడా ప్రజలు సంఘటితంగా నివసిస్తున్నారు.