amaravati

Amaravati: అమ‌రావ‌తి యాక్ష‌న్ ప్లాన్ రెడీ.. ఇక పరుగులే!

Amaravati: రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌నులు తిరిగి ప్రారంభించ‌డానికి సిఆర్డియో స‌న్న‌హాలు ముమ్మ‌రం చేసింది..ఇప్ప‌టికే పాతటెండ‌ర్లు ర‌ద్దు చేసి..మ‌ర‌లా టెండ‌ర్లు పిలిచింది..డిసెంబ‌ర్ 15 నుండి ద‌శ‌ల వారిగా ప్ర‌భుత్వ భ‌వ‌నాలు,రోడ్లు నిర్మాణం ప‌నులు ప్రారంభించ‌డానికి యాక్ష‌న్ ప్లాన్ సిద్దం చేసింది..రాజధాని లో ప్ర‌భుత్వ ప్ర‌యివేట్ సంస్థ‌ల‌కు భూకేటాయింపుల‌పై ఏర్పాటైన మంత్రి వ‌ర్గ ఉప‌సంఘం ఇప్ప‌టికే రెండు సార్లు భేటీ అయ్యింది..గ‌తంలో భూ కేటాయింపులు జ‌రిపిన సంస్థ‌ల‌ను సిఆర్డియో సంప్ర‌దింపులు చేస్తూనే..కొత్త సంస్థ‌ల‌కు భూకేటాయింపులు చేస్తుంది..రెండేళ్ల లో అన్ని ప్ర‌భుత్వ భ‌వ‌నాల నిర్మాణాలు పూర్తి చేయాల‌ని నిర్మాణ సంస్థ‌ల‌కు ష‌ర‌తు విధించింది..ప్ర‌యివేట్ సంస్థ‌ల‌కు భ‌వ‌నాల నిర్మాణం పై నిర్ధిష్ట కాల‌ప‌రిమితి లోగా నిర్మాణాలు చేస్తేనే భూ కేటాయింపులు చేస్తామ‌నే నిభంద‌న‌లు విధించింది.

రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌నులు 2014-19 టిడిపి హాయాంలో ప్రారంభ అయ్యాయి..కానీ 2019 లో జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక..ఏపికి మూడు రాజ‌ధానులు అంటూ..వైజాగ్ ప‌రిపాల‌నా రాజ‌ధాని వైజాగ్ అన‌డంతో.. అమ‌రావ‌తిలో ప‌నులు అన్ని ఎక్క‌డ‌వి అక్క‌డే నిలిచిపోయాయి..జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న లో ఎక్క‌డ‌వేసిన గోంగ‌ళి అక్క‌డే అన్న‌ట్లు పూర్తిగా నిలిచిపోయాయి..2024 లో ఏపిలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డంతో మ‌రాలా అమ‌రావ‌తి కి పూర్వ‌వైభ‌వం క‌ళ క‌న‌ప‌డుతుంది..ఇప్ప‌టికే కూట‌మి ప్ర‌భుత్వం పాత టెండ‌ర్లు ర‌ద్దు చేసి కొత్త గా టెండ‌ర్లు పిలిచింది..ప్ర‌భుత్వ భ‌వ‌నాల ప‌నులు, ల్యాండ్ పూలింగ్ ప‌నులు,ప్ర‌యివేట్, కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌ల‌కు కేటాయించిన ప‌నుల  ను ఎప్ప‌టి లోగా పూర్తి చేయాల‌న్నదానిపై సిఆర్డియో యాక్ష‌న్ ప్లాన్ సిద్దం చేసింది..వ‌చ్చే డిసెంబ‌ర్ 15 నుంచి ద‌శ‌ల వారిగా ప‌నులు ఎప్పుడు ప్రారంభించి..ఎప్ప‌టి లోగా పూర్తి చేయాల‌న్న‌దానిపై సిఆర్డియో క్లారిటి ఇచ్చింది..ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ, అఖిల భార‌త అధికారులు అపార్ట్ మెంట్ల నిర్మాణ అంచానా వ్య‌యం 700 కోట్లు కాగా ఇప్పటి వ‌ర‌కు 80 శాతం ప‌నులు ఇప్ప‌టికే పూర్తి కాగా..మిగిలిన 20 శాతం ప‌నులు వ‌చ్చే నెల 15 ప్రారంభించి వ‌చ్చే 6 నెలల్లోగా పూర్తి చేయాల‌ని నిర్మాణ సంస్థ‌కు ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఇది కూడా చదవండి: Fengal toofan: తిరుమలలో భారీ వర్షాలు.. నాలుగు విమానాలు రద్దు

Amaravati: ఎన్జీవో అపార్ట్మెంట్లు 1355 కోట్లు వ్య‌యం కాగా.. ఇప్ప‌టి వ‌ర‌కు 522 కోట్ల రుపాయిలు మేర ఖ‌ర్చు చేయ‌గా 62 శాతం ప‌నులు పూర్త‌య్యాయి..ఇప్పుడు మిగిలిన 28 శాతం ప‌నులు డిసెంబ‌ర్ 15 ప్రారంభించి..9 నెల‌లోగా పూర్తి చేయాల‌ని సిఆర్డియో టార్గెట్ పెట్టింది.. నాలుగో త‌ర‌గ‌తి ఉద్యోగులు అపార్టెమెంట్లు కు 975 కోట్లు నిర్మాణం వ్య‌యం కు గాను ఇప్ప‌టి వ‌ర‌కు 408 కోట్ల రుపాయిలు ఖ‌ర్చు చేయ‌గా 66 శాతం ప‌నులు పూర్తి చేయగా..ఇంకా 24 శాతం ప‌నులు డిసెంబ‌ర్ 15 ప్రారంభించి..వ‌చ్చే 9 నెల‌లోగా పూర్తి చేయాలి.. ప్ర‌భుత్వ ముఖ్య కార్య‌ద‌ర్శులు, కార్య‌ద‌ర్శులు అపార్ట్ మెంట్ల కు 274 కోట్ల అంచ‌నా వ్య‌యం కాగా..61 కోట్ల రుపాయిల మేర ఖ‌ర్చు చేయ‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు 28 శాతం కు పైగా ప‌నులు పూర్తి చేయ‌గా..మిగిలిన 62 శాతం ప‌నులు వ‌చ్చే నెల 15 నుండి ప్రారంభించి,  9 నెల‌లోగా పూర్తి చేయ‌నున్నారు.. మంత్రులు, జ‌డ్జీల బంగ్లాల నిర్మాణ అంచనా వ్య‌యం 235 కోట్ల రుపాయిలు కాగా..ఇప్ప‌టి వ‌ర‌కు 54 కోట్లు రుపాయిలు ఖ‌ర్చు తో 27 శాతం ప‌నులు పూర్తి చేయ‌గా..మిగిలిన ప‌నులు వ‌చ్చే నెల 15 నుండి ప్రారంభించి, 9 నెల‌లోగా పూర్తి చేయనున్నారు.

ALSO READ  Kadapa: అన్న క్యాంటీన్‌ దగ్గర భారీ పేలుడు

జ్యూడిషియ‌ల్ కాంప్లెక్స్ ఫేస్ 1, ఫేస్ 2 ల నిర్మాణ వ్య‌యం అంచ‌నా179 కోట్లు కుగాను ఇప్ప‌టి వ‌ర‌కు 165 కోట్లు రుపాయిలు ఖ‌ర్చు చేయ‌గా 90 శాతం ప‌నులు పూర్త‌య్యాయి..మిగిలిన ప‌నులు రెండు మూడు నెలల్లో పూర్తి చేయ‌నున్నారు..అడ్వ‌కేట్ బ్లాక్ ను 23 కోట్ల రుపాయిలు ఖ‌ర్చు తో నిర్మాణం ప‌నులు ప్రారంభించ‌గా..5 శాతం ప‌నులు మాత్ర‌మే పూర్త‌య్యాయి..మిగిలిన ప‌నులు వ‌చ్చే నాలుగు నెలల్లో పూర్తి చేయాలని టార్గెట్ విధించారు.ప్రాజెక్ట్ ఆఫిసు ఫేస్ 1, ఫేస్ 2.. 69 కోట్ల నిర్మాణ వ్య‌యం తో ప్రారంభించ‌గా..ఇప్ప‌టి వ‌ర‌క‌కు 77 శాతం ప‌నులుపూర్త‌య్యాయి..మిగిలిన ప‌నులు త్వ‌ర‌లో పూర్తి కానున్నాయి..ఎజీసి మౌళిక వ‌స‌తులు 1556 కోట్ల అంచ‌నా వ్య‌యంతో ప‌నులు ప్రారంభించగా..కేవ‌లం 6 శాతం ప‌నులే అయ్యియి..మిగిలిన ప‌నులు 2 ఏళ్ల లో పూర్తి చేయ‌నున్నారు.

ఇది కూడా చదవండి: Ap news: గుడ్ న్యూస్..బెనిఫిట్ కార్డులు వస్తున్నాయి

Amaravati: రాష్ట్ర ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే..అత్యంత కీల‌క‌మైన నూత‌న స‌చివాల‌యం ఐదు ట‌వ‌ర్స్ గా ప‌నులు ప్రారంభించింది..ఇందులో జిఏడి ట‌వర్ 662 కోట్ల రుపాయిలు అంచ‌నా వ్య‌యంతో ప‌నులు ప్రారంభించ‌గా..53 కోట్ల రుపాయిలు వ్య‌యం చేయ‌గా. కేవలం 13 శాతం ప‌నులే పూర్తి అయ్యాయి..మిగిలిన ప‌నులు వ‌చ్చే 30 నెలల్లో పూర్తి చేయాల‌ని భావిస్తోంది..మిగిలిన జిఎడి నాలుగు ట‌వ‌ర్ల నిర్మాణ వ్య‌యం 2041 కోట్ల రుపాయిలు కాగా..117 కోట్ల రుపాయిలు మేర ఖ‌ర్చు చేయ‌గా..మిగిలిన ప‌నులు వ‌చ్చే 30 నెల‌ల్లో పూర్తి చేయాల‌ని సిఆర్డియో భావిస్తోంది..ఇక ఐకానిక్ భ‌వ‌నం గా నిర్మించే అసెంబ్లీ భ‌వ‌నం అంచ‌నా వ్య‌యం 555 కోట్లు రుపాయిల‌తో ప‌నులు వ‌చ్చే జ‌న‌వ‌రి 30 న ప్రారంభించి..30 నెలల్లో పూర్తి చేయాల‌ని సిఆర్డియో టార్గెట్ ఫిక్స్ చేసింది.. ఇదే క్రమంలో రాజ‌ధాని లో కేంద్రం ప్ర‌భుత్వ సంస్థలు,ప్రయివేటు సంస్థ‌ల‌కు ఇచ్చే భూముల్లో కూడా ప‌నులు 2025 జ‌న‌వ‌రి 15 నుండి ప్రారంభించాల‌ని, వ‌చ్చే 24 నెలల్లో భ‌వ‌నాల నిర్మాణం పూర్తి చేయాల‌ని సిఆర్డియో అయా సంస్థ‌ల‌కు ష‌ర‌తు విధించింది.

ఇక రాజ‌ధాని కోసం ల్యాండ్ పూలింగ్ విధానంతో భూములు ఇచ్చిన రైతులుకు తిరిగి ఇచ్చే ఫ్లాట్లు లో మౌళిక వ‌స‌తులు జోన్ 1,2,3,4,5,6 ప‌నులు డిసెంబ‌ర్ 15 నుండి ప్రారంభించి..24 నెల‌ల్లోగా పూర్తి చేయాల‌ని ల‌క్ష్యం కాగా..మిగిలిన జోన్..7,8,9,10,11,12,12A ప‌నులు వ‌చ్చే డిసెంబ‌ర్ 20న‌ ప్రారంభించి. 24 నాలుగు నెల్ల‌లో సిఆర్డియో నిర్ధిష్ట‌మైన టైమ్ లైన్ విధించింది.. మొత్తం గా వ‌చ్చే 30 నెల‌లో రాజధాని అమ‌రావ‌తి అంత‌ర్జాతీయ న‌గ‌రానికి ఉండాల్సిన అన్ని హంగుల‌ను పూర్తి చేసుకుంటుంది.

ALSO READ  Pawan Kalyan: 30వేల పనులకు పల్లె పండుగ కార్యక్రమంలో శ్రీకారం

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *