Allu Arjun:సినీ నటుడు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును నాంపల్లి ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ కోసం అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు పోలీసులను కౌంటర్ పిటిషన్‌ను దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో చిక్కడపల్లి పోలీసులు సోమవారం తమ పిటిషన్‌ను దాఖలు చేశారు.
Allu Arjun:ఈ మేరకు నాంపల్లి కోర్టు విచారణను పరిశీలించింది. ఇరు వాదనలను విన్న కోర్టు బెయిల్ పిటిషన్‌పై తీర్పును కోర్టు వాయిదా వేసింది. వచ్చే ఏడాది జనవరి 3వ తేదీకి తీర్పును వాయిదా వేస్తున్నట్టు కోర్టు తెలిపింది. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై అటు అభిమానులు, సినీ జనంతోపాటు రెండు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తొక్కిసలాట ఘటన అనంతర పరిణామాలతో అల్లు అర్జున్, తెలంగాణ సర్కార్ మధ్య ఉత్కంఠను రేకెత్తించే సంఘటనలు ఎన్నో జరగడంతో ఈ కేసుపై ఆసక్తి నెలకొన్నది.