Allu Arjun: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సినీ ప్రస్థానంలో మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత హాలీవుడ్ సినిమా వార్తల మ్యాగజైన్ ‘ది హాలీవుడ్ రిపోర్టర్’ ఇప్పుడు ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ పేరిట భారతదేశంలో ప్రారంభం అవుతోంది. ఆసక్తికరంగా, ఈ మ్యాగజైన్ తన తొలి సంచికను అల్లు అర్జున్ ముఖచిత్రంతో విడుదల చేయడం విశేషం.
అల్లు అర్జున్ ప్రధాన ఆకర్షణగా ‘అల్లు అర్జున్: ది రూల్’ అనే కథనాన్ని కూడా ఈ కవర్ స్టోరీలో ప్రస్తావించారు. ముఖ్యంగా, అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2: ది రూల్’ సినిమా హిందీ సినిమా చరిత్రను తిరగరాసింది అని ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ పేర్కొంది. అంతేకాకుండా, ఆయనను “స్టార్ ఆఫ్ ఇండియా” అంటూ అభివర్ణించింది.
అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప 2: ది రూల్’ ప్రపంచవ్యాప్తంగా రూ. 1,871 కోట్ల వసూళ్లు సాధించి, భారతీయ సినీ చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ ఘనతతో అల్లు అర్జున్ అంతర్జాతీయంగా మరింత గుర్తింపు తెచ్చుకున్నారు.

