Akhil Akkineni: ఇటీవలే అక్కినేని అఖిల్ కు జైనబ్ రల్డీతో వివాహ నిశ్చితార్థం జరిగింది. వీరి పెళ్ళి కొత్త సంవత్సరంలో ఉంటుందని నాగార్జున తెలిపారు. ‘ఏజెంట్’ మూవీ పరాజయం తర్వాత కాస్తంత విరామం తీసుకున్న అఖిల్ మళ్ళీ యాక్షన్ మోడ్ లోకి వచ్చేశాడు. అతని తాజా చిత్రం ‘లెనిన్’ షూటింగ్ మొదలైంది. ఇందులో అఖిల్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. వినరో భాగ్యము విష్ణుకథ ఫేమ్ మురళీ కృష్ణ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో కలిసి అన్నపూర్ణ స్టూడియో సంస్థ నిర్మిస్తోంది. దీనికి లెనిన్ అనే పేరునే ఖరారు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టర్ ను పోస్ట్ చేశారు. హీరోగా మంచి విజయం కోసం యేళ్ళ తరబడి ఎదురుచూస్తున్న అఖిల్ కు లెనిన్ మూవీ ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.