AAA Muggula Poti: ముగ్గులకు మన అతివలకు విడదీయరాని బంధం. పల్లెల్లో ఉన్నా.. పట్టణాల్లో నివసిస్తున్నా తెల్లవారుజామున ఇంటిముందు ముగ్గు వేయకపోతే మనోళ్లకి రోజు ప్రారంభం అయినట్టు అనిపించదు. ఇక సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. ముత్యాల్లాంటి ముగ్గులతో తెలుగు రాష్ట్రాల్లో నెలంతా మెరిసిపోతుంది. నెలగంట పెట్టిన దగ్గర నుంచి ముక్కనుమ పండుగ వరకూ దాదాపు నెలరోజుల పాటు కొత్త కొత్త ముగ్గులు.. పాత ముగ్గులు మరింత వన్నెలు తెచ్చే పనిలో పడిపోతారు మన ఆడపడుచులు. ఉద్యోగం చేస్తున్నా.. ఇంటి పనుల్లో క్షణం తీరిక లేకున్నా ముగ్గులు పెట్టడం విషయంలో వారి ఆసక్తి ఏమాత్రం తగ్గదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాను..
AAA Muggula Poti: అమెరికాలో తెలుగు ప్రజల సంస్కృతీ.. సంప్రదాయాల బంధాలతో ఒక్కతాటి మీదకు తెస్తున్న ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) తన మొదటి మహా సభలను జరుపుకోబోతోంది. ఈ మహా సభలను ఏదో మమ అనిపించేలా కాకుండా.. మన సంప్రదాయాన్ని ప్రపంచమంతా మరోమారు ఆహా అంటూ చూసేలా చేయాలనీ సంకల్పించింది. ఇందుకోసం తెలుగు మహిళల జీవితంతో మమేకమైన ముత్యాల ముగ్గుల పోటీ నిర్వహిస్తోంది. ప్రపంచ ముగ్గుల పోటీలు గా నిర్వహించబోతున్నా ఈ పోటీల్లో విజేతకు 25,00,116 లక్షల రూపాయల బహుమతి ఇవ్వనుంది. అలాగే రెండో బహుమతిగా రూ.15,00,116లు, మూడో బహుమతిగా రూ.10,00,116లు, నాలుగో బహుమతిగా రూ.5,00,116లు, ఐదో బహుమతిగా రూ.2,00,116లు ఇవ్వనున్నారు. అంతే కాకుండా 100మందికి AAA ట్రోఫీ, సర్టిఫికెట్ లతో బాటు రూ.10,116లు అందచేయనున్నారు. ఈ పోటీలకు జ్యురి హెడ్ గా లావణ్య మోటుపల్లి వ్యవహరించనున్నారు. ఇక న్యాయ నిర్ణేతలుగా ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, గౌరవ జడ్జి వై.సురేష్, రిటైర్డ్ ఐపీఎస్ అదిఆకృ జె.సత్యనారాయణ, వ్యాపారవేత్త ప్రియా ఆచంట ఉన్నారు.
AAA Muggula Poti: పోటీలు, బహుమతులు భలే ఉన్నాయి. మరి ఇందులో పాల్గోవడం ఎలా? అమెరికా వెళ్లి ముగ్గులు వేయాలా అని అనుకుంటున్నారా? కానే కాదు. చక్కగా మీ ఇంటిలోనే కూచుని మీరు ముగ్గు వేస్తే చాలు. ఊరుకోండి మా ఇంటిలో ముగ్గేస్తే అమెరికాలో ఉన్నవాళ్లు ఎలా చూస్తారు? అంటున్నారు కదూ. అయితే, మీ డౌట్ తీర్చేస్తాను. ఇప్పుడు మీరు ఇంటిలోనే కూచుని.. మీ సిస్టమ్ ఆన్ చేసి జస్ట్ ఈ లింక్ https://nationalconvention1.theaaa.org/index.html క్లిక్ చేయండి. అక్కడ కనిపించే ముగ్గుల పోటీ అనే ఇమేజీ మీద క్లిక్ చేయండి. అప్పుడు కనిపించిన సూచనల ప్రకారం మీ వివరాలు ఎంటర్ చేయండి. తరువాత మీరు మీ ఇంటి దగ్గర లేదా ఎక్కడైనా ఆరుబయట అది మీ ఇష్టం ముగ్గు వేస్తూ వీడియో రికార్డ్ చేయండి. (సోషల్ మీడియా రీల్స్ కోసం చేస్తుంటారుగా అలా అన్నమాట) వీడియో అన్నామని ముగ్గు పెట్టడానికి మీరు సిద్ధం అవుతున్న దగ్గర నుంచి ముగ్గు పెట్టడం పూర్తి చేసి అందరికీ చూపించి సంతోష పడేంత వరకూ పెద్ద వీడియో చేయకండి. సింపుల్ గా మీరు ముగ్గు కోసం చుక్కలు పెట్టడం ప్రారంభించి ముగ్గు అయిపోయేవరకు వీడియో రికార్డ్ చేయండి అంతే. అన్నట్టు వీడియో తీసే ముందుగానే ముగ్గు పెట్టడానికి అవసరమైన అన్నిటినీ అంటే ముగ్గులు, రంగులు ఇలాంటివి సిద్ధం చేసుకోవడం మర్చిపోకండి. సరే, వీడియో తీసిన తరువాత ఇందాకా ఇచ్చిన లింక్ వుంది కదా దానిపై మళ్ళీ క్లిక్ చేసి ముగ్గుల పోటీల ఇమేజ్ క్లిక్ చేసి అక్కడ చెప్పిన విధంగా మీ వీడియో అప్ లోడ్ చేయండి. అంతే.. మీ పని అయిపోయినట్టే.
AAA Muggula Poti: ఓస్ ఇంతేకదా చేసేద్దాం అని మళ్ళీ మీ పనుల్లో పడి మర్చిపోకండి. ఆల్రెడీ ముగ్గుల పోటీల్లో పాల్గొనాలనే ఉత్సాహం వారికోసం ఇప్పటికే రిజిస్ట్రేషన్స్ ప్రారంభం అయ్యాయి. జనవరి 15, 2025 వరకూ రిజిస్ట్రేషన్ కి చివరి తేదీ. అలాగే ఇప్పటికే చాలామంది ఆన్లైన్ లో వీడియో సబ్మిట్ చేయడం ప్రారంభం అయింది. జనవరి 15, 2025లోపు మీ వీడియోలు పంపించవచ్చు. ఆ తేదీ తరువాత ఛాన్స్ ఉండకపోవచ్చు. అందుకని.. ఇంకెందుకు ఆలస్యం వెంటనే రిజిస్టర్ చేసుకోండి.. ముత్యమంటి ముగ్గును వేసేయండి. వీడియో తీసేయండి.. అప్ లోడ్ చేసేయండి త్వరగా.
AAA Muggula Poti: అన్నట్టు మీ ముగ్గులెలా ఉన్నాయో చెప్పడానికి న్యాయనిర్ణేతలు ఎవరో చెప్పాలి కదా. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, గౌరవ జడ్జి వై.సురేష్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి జె.సత్యనారాయణ, వ్యాపారవేత్త ప్రియా ఆచంట ప్రపంచ వ్యాప్తంగా మీలాంటి ఉత్సాహవంతులు వేసిన ముగ్గులను చూసి.. వాటిలో అద్భుతమైన వాటిని ఎంపిక చేస్తారు. తరువాత AAA వెబ్సైట్ లో ముగ్గుల పోటీల్లో విజేతలను ప్రకటిస్తుంది.
AAA Muggula Poti: అదండీ విషయం అమెరికాలోని తెలుగువారే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు ఎవరైనా సరే ఈ పోటీల్లో పాల్గొన వచ్చు. పల్లె సీమల్లో అందమైన ముగ్గులు పెట్టె అతివలకు ఇది మంచి ఛాన్స్. మారేందుకు ఆలస్యం వెంటనే ముగ్గుల పోటీకి రెడీ అయిపోండి.