Emergency Landing

Emergency Landing: విమానంలో సాంకేతిక లోపం.. రెండుగంటల తరువాత ఎమర్జెన్సీ లాండింగ్!

Emergency Landing: హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి తిరుపతి వెళ్లే అలయన్స్ ఎయిర్‌లైన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో, పైలట్ అప్రమత్తమై వెంటనే ATC (Air Traffic Control) కేంద్రానికి సమాచారం అందించాడు. విమానం వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట సమీపంలో ఉన్నప్పుడే పైలట్ సమస్యను గుర్తించడంతో, అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరాడు.

ఈ విమానం 66 మంది ప్రయాణికులతో ఉదయం 6:12 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి, 8:17 గంటలకు తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులకు వెంటనే అప్రమత్తంగా మారాలని పైలట్ సూచించగా, విమానాశ్రయ అధికారులు వెంటనే అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు.

ఇది కూడా చదవండి:Cherlapally Fire accident: చ‌ర్ల‌ప‌ల్లి కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో భారీ అగ్నిప్ర‌మాదం.. తీవ్ర న‌ష్టం.. రాత్రివేళ‌ క‌ల‌క‌లం

విమానంలోని ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని శంషాబాద్ విమానాశ్రయ అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం సాంకేతిక లోపాన్ని సరిచేసే పనులు కొనసాగుతున్నాయని, సమస్య పరిష్కారమైన వెంటనే విమానాన్ని తిరిగి ప్రయాణానికి అనుమతిస్తామని తెలిపారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం రెస్ట్ రూమ్ మరియు ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *