2024 Flight Accidents: ఇటీవల వరుసగా రెండు భారీ విమాన ప్రమాదాలు జరిగాయి. కజకిస్తాన్, దక్షిణ కొరియాలో జరిగిన రెండు విమాన ప్రమాదాల్లో 217 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటిలో తాజాగా జరిగిన ప్రమాదం.. దక్షిణ కొరియాలోని మువాన్‌కు చెందినది, గేర్ బాక్స్‌లో లోపం కారణంగా విమానం ల్యాండింగ్ సమయంలో కూలిపోయింది. ఈ విమానంలో 175 మంది ప్రయాణికులు, 6 మంది సిబ్బందితో సహా 181 మంది ఉన్నారు. వీరిలో 179 మంది మరణించారు. కాగా అంతకు ముందు కజకిస్థాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు.
2024లో మొత్తం 8 పెద్ద విమాన ప్రమాదాలు జరగ్గా, 402 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా ప్రమాదాలు చెడు వాతావరణం లేదా విమానం ఇంజిన్ వైఫల్యం కారణంగా సంభవించాయి. ఒక విమాన ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో సహా పలువురు నాయకులు మరణించారు. ఈ ఏడాది జరిగిన 8 విమాన ప్రమాదాల గురించి ఒకసారి చూద్దాం..
జనవరి 24: రష్యా సైనిక విమాన ప్రమాదంలో 74 మంది మృతి
2024 Flight Accidents: ఈ ఏడాది జనవరిలో రష్యాలోని బెల్గోరోడ్ ప్రాంతంలో జరిగింది. ఈ ప్రమాదంలో 74 మంది చనిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 65 మంది ఉక్రెయిన్ ఖైదీలు, 9 మంది రష్యా సిబ్బంది ఉన్నారు. ఘటన అనంతరం రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఉక్రెయిన్ క్షిపణి విమానాన్ని ఢీకొట్టిందని చెప్పింది. అయితే, ఉక్రెయిన్ మాత్రం రష్యా కుట్ర అని పేర్కొంది.
మార్చి 12: రష్యాలోని ఇవానోవోలో విమానం కూలింది
ఇల్యుషిన్ ఐఎల్-76 కార్గో విమానం రష్యాలోని ఇవానోవో ఒబ్లాస్ట్‌లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది మరణించారు. అందులో 7 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. విమానం ఇంజన్‌లో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది.
మే 19: ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదం
2024 Flight Accidents: ఈ ఏడాది మేలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీరాబ్దుల్లాహియాన్ సహా 9 మంది చనిపోయారు. ఇరాన్ అధ్యక్షుడి కాన్వాయ్‌లో 3 హెలికాప్టర్లు ఉండగా వీటిలో 2 హెలికాప్టర్లు సురక్షిత ప్రాంతానికి చేరుకున్నాయి. దట్టమైన పొగమంచుతో కూడిన పర్వత ప్రాంతాన్ని దాటుతుండగా హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు 600 కిలోమీటర్ల దూరంలోని అజర్‌బైజాన్ సరిహద్దు నగరం జోల్ఫా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
జూన్ 10: మలావి వైస్ ప్రెసిడెంట్ విమాన ప్రమాదంలో మరణించారు
2024 Flight Accidents: మలావి వైస్ ప్రెసిడెంట్ సౌలోస్ క్లాస్ చిలిమా విమాన ప్రమాదంలో మరణించారు. జూన్ 10న అదృశ్యమైన వైస్ ప్రెసిడెంట్ విమాన శకలాలు దొరికాయి. ఈ ప్రమాదంలో అతనితో పాటు ప్రయాణిస్తున్న తొమ్మిది మందిలో ఎవరూ బయటపడలేదు. ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు.
జూలై 24: నేపాల్ విమాన ప్రమాదం:
2024 Flight Accidents: 24 జూలై 2024న, సౌరీ ఎయిర్‌లైన్స్ విమానం పోఖారాకు వెళ్తుండగా నేపాల్‌లోని ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూలిపోయింది. 9N-AME విమానం సౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందినది. ఈ ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉదయం 11 గంటలకు త్రిభువన్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. మరణించిన వారిలో 17 మంది సూర్య ఎయిర్‌లైన్స్ ఉద్యోగులు కాగా, మిగిలిన ఇద్దరు సిబ్బంది. 21 ఏళ్ల నాటి ఈ విమానాన్ని మరమ్మతులు చేసి పరీక్షలకు తీసుకెళ్తున్నారు.
ఆగస్ట్ 9న బ్రెజిల్ లో ..
బ్రెజిల్‌లోని సావో పాలో రాష్ట్రంలోని విన్‌హెడో నగరంలో ఆగస్టు 9న వోయిపాస్ ఫ్లైట్ 2283 ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 62 మంది మరణించారు. ఇది దేశీయ బ్రెజిలియన్ ప్యాసింజర్ విమానం. విమాన ప్రమాదానికి గల కారణాలపై ఇంకా విచారణ కొనసాగుతోంది.
డిసెంబర్ 25: అజర్‌బైజాన్ విమాన ప్రమాదంలో 38 మంది మరణించారు
2024 Flight Accidents: డిసెంబర్ 25 న, కజకిస్తాన్‌లోని అక్టౌలో ఒక ప్రయాణీకుల విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 38 మంది మరణించారు. విమానంలో 62 మంది ప్రయాణికులు, 5 మంది సిబ్బంది ఉన్నారు. విమానం అజర్‌బైజాన్ నుండి రష్యాలోని చెచ్న్యా ప్రావిన్స్ రాజధాని గ్రోజ్నీకి వెళుతుండగా, కజక్ నగరమైన అక్టౌకి దాదాపు 3 కి.మీ దూరంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ సమయంలో, విమానం కూలిపోయి రెండు ముక్కలైంది, ఆ తర్వాత మంటలు చెలరేగాయి. విమాన ప్రమాదంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ క్షమాపణలు చెప్పారు. తమ గగనతలంలో ప్రమాదం జరిగినందుకు చింతిస్తున్నట్లు అజర్‌బైజాన్ అధ్యక్షుడికి తెలిపారు.
డిసెంబర్ 29: దక్షిణ కొరియాలో విమాన ప్రమాదం, 179 మంది మరణం
జెజు ఎయిర్ విమానం దక్షిణ కొరియాలోని మువాన్ విమానాశ్రయంలో కూలిపోయింది. విమానంలో 175 మంది ప్రయాణికు…